త్రివిక్రమ్ సినిమా లేనట్టేనా..? | Suriya Film with Trivikram Srinivas Dropped | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ సినిమా లేనట్టేనా..?

Feb 8 2017 11:10 AM | Updated on Sep 5 2017 3:14 AM

త్రివిక్రమ్ సినిమా లేనట్టేనా..?

త్రివిక్రమ్ సినిమా లేనట్టేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా కాలంగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా కాలంగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ ప్రాజెక్ట్పై కథాచర్చలు కూడా జరిపిన త్రివిక్రమ్, సూర్య ఫైనల్గా పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. సింగం 3 రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సూర్య ఎక్కడా త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించలేదు.

త్రివిక్రమ్ కూడా పవన్, ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో సూర్య, త్రివిక్రమ్ల కాంబినేషన్లో ఇప్పట్లో సినిమా పట్టాలెక్కే చాన్స్ కనిపించటం లేదు. ఎన్నో వాయిదాల తరువాత సూర్య హీరోగా తెరకెక్కిన సింగం 3 గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో మరోసారి సూపర్ హిట్ కొట్టి కోలీవుడ్తో పాటు టాలీవుడ్ లోనూ సత్తా చాటాలనుకుంటున్నాడు సూర్య.

Advertisement
 
Advertisement
Advertisement