సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో.. | Suresh Babu Acquires Mental Madhilo rights | Sakshi
Sakshi News home page

సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో..

Sep 9 2017 11:29 AM | Updated on Sep 17 2017 6:39 PM

సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో..

సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో..

గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న

గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో మూవీ మెంటల్ మదిలో... అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.  న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమా రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, మెంటల్ మదిలో సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకోవటం విశేషం. ఇటీవల చిత్రయూనిట్ తో కలిసి మెంటల్ మదిలో ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement