సాయిధరమ్ తేజ్ స్టార్‌గా ఎదుగుతాడు | Supreme Success Meet Function | Sakshi
Sakshi News home page

సాయిధరమ్ తేజ్ స్టార్‌గా ఎదుగుతాడు

May 9 2016 10:53 PM | Updated on Sep 2 2018 5:43 PM

సాయిధరమ్ తేజ్ స్టార్‌గా ఎదుగుతాడు - Sakshi

సాయిధరమ్ తేజ్ స్టార్‌గా ఎదుగుతాడు

‘‘సుప్రీమ్ సినిమా చూశాను. ముఖ్యంగా ఇందులో మానసిక వికలాంగులతో తీసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్‌గా ఎదుగుతాడు’’ అని...

-  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
‘‘సుప్రీమ్ సినిమా చూశాను. ముఖ్యంగా ఇందులో మానసిక వికలాంగులతో తీసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్‌గా ఎదుగుతాడు’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘సుప్రీమ్’ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ సినిమాలో చాలా సీన్స్‌లో సాయిధరమ్ మా అన్నయ్య చిరంజీవిని గుర్తు చేశాడు’’ అని సాయికుమార్ అన్నారు, ‘‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అనిల్‌కే దక్కుతుంది.

పేపర్ వర్క్ లేకుండా నాతో ఈ సినిమా చేయించాడు’’ అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘దర్శకుడు అనిల్ ఇన్‌పుట్స్‌తోనే బాలు అనే క్యారెక్టర్‌ను బాగా చేయగలిగా. రాజేంద్రప్రసాద్‌గారు, మిఖేల్, నా కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ‘‘నటీనటులందరూ వానరసైన్యంలా సపోర్ట్ చేశారు’’ అని అనిల్ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ క్లైమాక్స్ ఫైట్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఇంకా ఈ వేడుకలో నటులు ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాసరెడ్డి, రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement