మొదటిరోజే 'సుప్రీం' కలెక్షన్ల హవా | 'Supreme' mints Rs.6.75 crore on first day | Sakshi
Sakshi News home page

మొదటిరోజే 'సుప్రీం' కలెక్షన్ల హవా

May 7 2016 11:37 AM | Updated on Sep 2 2018 5:18 PM

మొదటిరోజే  'సుప్రీం'   కలెక్షన్ల హవా - Sakshi

మొదటిరోజే 'సుప్రీం' కలెక్షన్ల హవా

మెగా కుర్ర హీరో సాయి ధరమ్ తేజ నటించిన సుప్రీం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన మొదటి రోజే దాదాపు ఏడు కోట్లను వసూలు చేసింది.

చెన్నై:  పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్లతో మాంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్  తాజా చిత్రం 'సుప్రీం' కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.   ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సుప్రీం'  థియేటర్లలో తన హవాను  చాటుకుంటోంది.  తమిళ సూపర్ స్టార్ సూర్య 24  మూవీకీ ధీటుగా వసూళ్లను కొల్లగొడుతోంది.   తన మార్క్ యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లలో బాగా ఆకట్టుకుంటున్న మెగా కుర్ర హీరో సాయి ధరమ్ తేజ  నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన మొదటి రోజే  దాదాపు ఏడు కోట్లను వసూలు  చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా  ఈ గురువారం ప్రేక్షకులకు ముందుకొచ్చిన సుప్రీం ఒక్క రోజులోనే 6.75 లక్షల  వసూళ్లను రాబట్టిందని సినిమా ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ ఐఏఎన్ఎస్  కు తెలిపారు. ఈ హవాతో వారాంతంలో  మరిన్ని లాభాలను సాధిస్తుందని అంచనా  వేస్తున్నారు. యాక్షన్, కామెడీ ఎంటరైనర్ గా  రూపొందిన ఈ చిత్రంలో   సాయ్  క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోదన్నారు. ఆయన నటనే సినిమా విజయానికి బాగా తోడ్పడుతోందని తెలిపారు.   రాసి ఖన్నా,  రాజేంద్ర ప్రసాద్ , రవి కిషన్ సాయి కుమార్ , మైఖేల్ గాంధీ, కబీర్ దుహాన్ సింగ్, రదితరులు ఈ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement