అట్లీకి సూపర్‌చాన్స్‌? | Superstar Rajinikanth act Atlee new movie | Sakshi
Sakshi News home page

అట్లీకి సూపర్‌చాన్స్‌?

Feb 9 2018 4:34 AM | Updated on Feb 9 2018 4:34 AM

Superstar Rajinikanth act Atlee new movie - Sakshi

రజనీకాంత్‌, అట్లీ

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా యువ దర్శకుడు అట్లీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారా? అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాధానం  కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. స్టార్‌ దర్శకుడు శంకర్‌ శిష్యులలో ఒకరు అట్లీ అన్న విషయం తెలిసిందే. ఈయన రజనీ నటించిన ఎందిరన్‌ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజా రాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ, ఆ తరువాత విజయ్‌ హీరోగా వరుసగా తెరి, మెర్శల్‌ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు.

తదుపరి చిత్రాన్ని విజయ్‌తోనే చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అట్లీ ఆ చిత్రానికి ఆళపోరాన్‌ అనే టైటిల్‌కు కూడా రిజిస్టర్‌ చేయించారనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో అట్లీ రజనీకాంత్‌ను కలిసి కథ వినిపించినట్లూ, ఆ కథ రజనీకాంత్‌ను ఇంప్రెస్‌ చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నట్లు టాక్‌.

రజనీకాంత్‌ నటించిన కాలా చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 14న విడుదలకు, ఆ తరువాత 2.ఓ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు ప్రచారంలో ఉంది. రాజకీయరంగ ప్రవేశానికి అస్త్ర శస్త్రాలను కూడగట్టుకుంటున్న రజనీ మంచి రాజకీయ నేపథ్యంతో కూడిన కథ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. కాగా ఆళపోరాన్‌ టైటిల్‌ చూస్తుంటేనే ఇది పూర్తిగా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని తెలుస్తోంది. ఆ టైటిల్‌ ఇప్పుడు రజనీకాంత్‌కు సరిగ్గా సరిపోతుంది. అందుకే అట్లీ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల భావన.  

Advertisement
 
Advertisement
Advertisement