సినిమా కాదు.. ఒక లైఫ్‌ చూసినట్టు అనిపించింది: కృష్ణ | Super Star Krishna Praises NTR Biopic And Balakrishna | Sakshi
Sakshi News home page

Jan 11 2019 7:28 PM | Updated on Jan 11 2019 7:29 PM

Super Star Krishna Praises NTR Biopic And Balakrishna - Sakshi

సినిమా చూసిన‌ట్లు కాకుండా ఒక లైఫ్ చూసిన‌ట్టు అనిపించింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్‌ మూవీ ‘యన్‌.టి.ఆర్ కథానాయకుడు’‌. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తోంది. తాజాగా ఈ  చిత్రాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ దంపతులు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘నంద‌మూరి బాల‌కృష్ణ రూపొందించిన య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసిన‌ట్లు కాకుండా ఒక లైఫ్ చూసిన‌ట్టు అనిపించింది. బాల‌కృష్ణ.. ఎన్టీఆర్‌లా వంద‌శాతం క‌నిపించారు. ఆయ‌న వేసిన అన్నీ గెట‌ప్స్‌లోనూ బావున్నారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని  ఆశిస్తున్నాను’ అన్నారు.

విజ‌య నిర్మల మాట్లాడుతూ - ` ఈ బయోపిక్‌లో బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూసినట్టే అనిపించింది. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం`` అన్నారు. న‌రేష్ విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ - ``య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ అనౌన్స్ అయిన‌ప్పుడు ఇందులో ఓ అవకాశం వ‌స్తుందా! అని ఆస‌క్తిగా ఎదురుచూశాను. ఈ బ‌యోపిక్‌లో వేషం వేయాల‌ని న‌న్ను అడిగిన‌ప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ.సుబ్బారావు వేషం. ఆ స‌న్నివేశాల‌ను నేను చేస్తున్న‌ప్పుడు థ్రిల్ ఫీల‌య్యాను. మా అమ్మ తొలి సినిమా ఆయ‌న‌తోనే న‌టించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా స‌మ‌యంలో ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నాను. ద‌ర్శకుడు క్రిష్‌ ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండ్రీ డైరెక్టర్ అయ్యారు’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement