లేడీ గెటప్‌లో అదరగొట్టిన విజయ్‌! | Super Deluxe First Look Poster | Sakshi
Sakshi News home page

Oct 8 2018 9:00 PM | Updated on Oct 8 2018 9:21 PM

Super Deluxe First Look Poster - Sakshi

విజయ్‌ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సూపర్‌ డీలక్స్’‌. ‘అరణ్యకాండం’ ఫేమ్‌ త్యాగరాజన్‌ కుమార్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది . సినిమాలోని ముఖ్య తారలందరి ఫొటోలతో కూడిన ఫస్ట్‌లుక్‌లో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌లో అదరగొట్టాడు.

ఈ సినిమాలో ‘శిల్ప’ అనే ట్రాన్స్‌జండర్‌ పాత్రలో విజయ్‌ నటించాడని సమాచారం. ఫాహద్‌ ఫాజిల్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కాగా విజయ్‌ సేతుపతి నటించిన 96 సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుండటంతో సూపర్‌ డీలక్స్‌ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement