ఫొటోలు దిగి మురిసిపోయిన సన్నీ లియోన్‌ | Sunny Leone Wax Statue In Madame Tussauds Delhi | Sakshi
Sakshi News home page

Sep 19 2018 11:53 AM | Updated on Sep 19 2018 1:17 PM

Sunny Leone Wax Statue In Madame Tussauds Delhi - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మంగళవారం సన్నీ మైనపు విగ్రహం కొలువుదీరింది. విశేషంగా సన్నీ మైనపు విగ్రహాన్ని ఆమే అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త డానియల్‌ వెబర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన మైనపు విగ్రహంతో ఫొటోలు దిగుతూ మురిసిపోయారు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌, విరాట్‌ కోహ్లి, షారుక్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌ వంటి ప్రముఖల మైనపు విగ్రహాలు ఇక్కడ కొలువుదీరిన సంగతి తెలిసిందే.

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఉంచడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నా విగ్రహానికి సరైన ఆకృతి తీసుకురావడానికి చాలా మంది కష్టపడ్డారు. వారి కష్టాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ గొప్ప గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాన’ని తెలిపారు. ఆమె భర్త డెనియల్‌ వెబర్‌ కూడా దీనిపై తన ఆనందాన్ని ట్విటర్‌లో వ్యక్తం చేశారు. సన్నీ మైనపు విగ్రహాంతో తాను దిగిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. మరోవైపు సన్నీతో సెల్ఫీ దిగాలంటే ఢిల్లీలోని టుస్సాడ్స్‌ మ్యూజియం వెళితే సరిపోతుందంటూ.. నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్‌లు చేస్తున్నారు. కాగా ఇటీవలే సన్నీ జీవితం ఆధారంగా తెరకెక్కిన కరణ్‌జిత్‌ కౌర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement