సన్నీ స్టెప్పేస్తే! | Sunny Leone item song in Temper remake | Sakshi
Sakshi News home page

సన్నీ స్టెప్పేస్తే!

Nov 18 2018 3:46 AM | Updated on Nov 18 2018 8:57 AM

Sunny Leone item song in Temper remake - Sakshi

సన్నీ లియోన్‌

సన్నీ లియోన్‌ స్పెషల్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ వేస్తే సినిమాకో క్రేజ్‌ ఏర్పడుతుంది.. సన్నీ స్టెప్పేస్తే సిల్వర్‌ స్క్రీన్‌ షేక్‌ అవ్వడం ఖాయం. ఆల్రెడీ హిందీలో ‘పింక్‌ లిప్స్, లైలా మే లైలా’ వంటి స్పెషల్‌ సాంగ్స్‌తోపాటు రాజశేఖర్‌ ‘పీయస్‌వీ గరుడవేగ’ చిత్రంలో  ‘డియో డియో..’ వంటి సాంగ్‌తో సన్నీ ఎంతటి సెన్సేషన్‌ సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు అదే క్రేజ్‌ తమ సినిమాకి తోడవ్వాలనుకుంటున్నారు ‘అయోగ్య’ చిత్రబృందం. తెలుగు సూపర్‌హిట్‌ చిత్రం ‘టెంపర్‌’ను హీరో విశాల్‌ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

రాశీ ఖన్నా కథానాయిక. ఏఆర్‌ మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ దర్శకుడు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం చిత్రబృందం సన్నీ లియోన్‌ని సంప్రదించారట. ‘టెంపర్‌’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా’ అనే సాంగ్‌కు నోరా ఫతేహి స్టెప్స్‌ వేశారు. ఇప్పుడు ఈ ఐటమ్‌ సాంగ్‌కే తమిళంలో సన్నీ స్టెప్పులు వేయనున్నారట. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ సోమవారం రిలీజ్‌ కానుందని సమాచారం. ఈ చిత్రాన్మి ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement