మలయాళీ రంగీలా

Sunny Leone gets ready to storm Malayalam cinema - Sakshi

ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారు ఓ సందర్భంలో సన్నీ లియోన్‌ కొచ్చి వెళ్లినప్పుడు. ఆ తర్వాత సన్ని లియోన్‌ మలయాళంలో ఓ సినిమా చేయనున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలే నిజమయ్యాయి. సన్నీ మాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘మనీ రత్నం’ ఫేమ్‌ సంతోష్‌ నాయర్‌ దర్శకత్వంలో సన్నీ లియోన్‌ నటించనున్నారు. జయలాల్‌ మీనన్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘రంగీల’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో సన్నీ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ‘‘పీరియాడికల్‌ సినిమా ‘వీరమహాదేవి’ ఫిజికల్‌గా చాలెంజింగ్‌గా ఉంది.

నా జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కరణ్‌జీత్‌ కౌర్‌’ వెబ్‌ సిరీస్‌కు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. ఇవి కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉన్న సినిమాల్లో నటించాలనుకుని మలయాళ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చా. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా మొదలవుతుంది. సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే వర్క్‌షాప్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం. రోడ్‌ ట్రిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్‌ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాగూ హిందీ భాష వచ్చు. ఇప్పుడు మలయాళం నేర్చుకోవాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు సన్నీ లియోన్‌. అంతేకాదు ‘పాస్‌వర్డ్‌’ అనే నేపాలి ఫిల్మ్‌లో ఓ డ్యాన్స్‌ నంబర్‌కు చిందేయనున్నట్లు సన్నీ లియోన్‌ ట్వీటర్‌ ద్వారా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top