సన్నీలియోన్‌పై మరో కేసు నమోదు! | sunny leone and tushar kapoor in a fresh soop after fir filed on mastizade | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్‌పై మరో కేసు నమోదు!

Feb 10 2016 2:14 PM | Updated on Oct 5 2018 9:09 PM

సన్నీలియోన్‌పై మరో కేసు నమోదు! - Sakshi

సన్నీలియోన్‌పై మరో కేసు నమోదు!

కొత్త సినిమా విడుదల అవుతోందని సంబరంగా ఉన్న సన్నీ లియోన్.. ఇప్పుడు కష్టాల్లో పడింది.

కొత్త సినిమా విడుదల అవుతోందని సంబరంగా ఉన్న సన్నీ లియోన్.. ఇప్పుడు కష్టాల్లో పడింది. ఆమెతోపాటు సినిమాలో నటించిన తుషార్ కపూర్, వీర్ దాస్ తదితరులపై ఓ కేసు నమోదైంది. మిలాప్ జవేరీ తీసిన 'మస్తీజాదే' సినిమాలో నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది మీద కూడా ఈ కేసు దాఖలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. మస్తీజాదే సినిమాలో ఓ ఆలయంలో చాలా అసభ్యకరమైన రీతిలో కండోమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఓ సన్నివేశం ఉంటుంది.

ఆ సన్నివేశంతో సెంటిమెంట్లను దెబ్బతీశారంటూ ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు లెక్కలేనన్ని కత్తెరలు వేస్తే తప్ప విడుదలకు ఆమోదం తెలపలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్తగా కేసు కూడా నమోదు కావడంతో ఇక ఏం చేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement