breaking news
Tushar kapoor
-
దురదృష్టమని వదిలేస్తే.. అదే ఇప్పుడు రూ.450 కోట్లు అయ్యింది!
ఒకప్పుడు సొంత ఇల్లు కొనడం ఓ కల మాత్రమే. చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించిన ఓ యువ నటుడు.. ఆ తర్వాత నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంగ్లా కొనుగోలు చేశాడు. కానీ ఆ కలల ఇల్లు కొన్నాళ్లకే అతడికి ఆందోళనకు కారణమైంది. వరుస పరాజయాలతో ఆ బంగ్లా తనకు కలిసి రావడం లేదని భావించి వదిలేశాడు. అయితే కాలం గడిచాక అదే ఆస్తి అతడి జీవితంలోనే అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆ కథ ప్రముఖ నటుడు జీతేంద్రది.ముంబైలోని చాల్ జీవితం నుంచి స్టార్డమ్ వరకు ఎదిగిన జీతేంద్ర.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద కల నెరవేర్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. పాలి హిల్‌లోని తన బంగ్లాను విక్రయించేందుకు ముందుకొచ్చారు. జీతేంద్ర తండ్రితో చర్చించిన తర్వాత ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ఆస్తి ధర కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లా అప్పట్లోనే ఎంతో విలువైన ఆస్తి.కొన్నాకే మొదలైన కష్టాలు..బంగ్లాలోకి మారిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదని జీతేంద్ర గుర్తు చేసుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆ ఇంటి వల్లే తనకు దురదృష్టం వెంటాడుతోందని ఆయన భావించారు. “భరత్ భూషణ్ ఈ ఇంటిని వదిలేశారు.. ఇప్పుడు నా వంతు వచ్చినట్లు అనిపించింది. ఇలాగే కొనసాగితే నా కెరీర్ మొదలయ్యేలోపే ముగిసిపోతుందేమో అనుకున్నాను” అని జీతేంద్ర గతాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బంగ్లాను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అన్‌లక్కీ అనుకున్నదే అదృష్టంగా మారిందిఏళ్లు గడిచిన తర్వాత అదే ఆస్తి విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ బంగ్లాను పునర్నిర్మించాలని నిర్ణయించిన సమయంలో ఆసక్తికర విషయం బయటపడింది. పాత భవనాన్ని కూల్చినప్పుడు అందులో ఉపయోగించిన బర్మా టీక్ కలపకే రూ.11.5 లక్షలు వచ్చాయని జీతేంద్ర తెలిపారు. అంటే.. మొత్తం బంగ్లాను కొనుగోలు చేసిన ధర కంటే కలప ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ కావడం విశేషం.రూ.85కు అమ్మిన ఫ్లాట్లు.. ఇప్పుడు రూ.85 వేల ధరతర్వాత ఆ స్థలంలో జీతేంద్ర గౌతమ్ అపార్ట్మెంట్స్ నిర్మించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై సందేహంతో ఫ్లాట్లను చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున విక్రయించారు. కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు చదరపు అడుగు ధర దాదాపు రూ.85 వేల వరకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ వెల్లడించారు.రూ.4.25 లక్షల ఆస్తి.. రూ.450 కోట్ల విలువఒకప్పుడు దురదృష్టానికి కారణమని భావించిన ఆ బంగ్లా.. ఇప్పుడు జీతేంద్ర జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ భవనం ఉన్న స్థలం విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఓ ఆస్తిని చూసే దృష్టి కాలంతో ఎలా మారిపోతుందో జీతేంద్ర బంగ్లా కథ చెబుతోంది. అప్పట్లో భయంతో వదిలేసిన ఇల్లు.. ఇప్పుడు కోట్ల విలువైన సంపదగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సినీ తారలకు రియల్ ఎస్టేట్ కలిసి వచ్చిన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తెలుగు సినీ దిగ్గజం శోభన్‌బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి భారీ సంపదను సృష్టించారు. అప్పట్లో భూములపై ముందుచూపుతో పెట్టిన పెట్టుబడులు.. తర్వాత కాలంలో కోట్ల విలువైన ఆస్తులుగా మారాయి. జీతేంద్ర బంగ్లా కథ కూడా ఇలాంటి దూరదృష్టికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. -
పెళ్లి కాకుండానే తండ్రైన కరణ్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తండ్రి అయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను కూడా బహిరంగంగా మాట్లాడే కరణ్ ఫిబ్రవరిలోనే కవల పిల్లలకు తండ్రి అయిన ఇన్నాళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టాడు. సరోగసి విధానం ద్వారా ఓ బాబు, ఓ పాపకి ఆయన జన్మనిచ్చాడు. ముంబై అంధేరిలోని మస్రానీ హాస్పిటల్ లో ఇద్దరు పిల్లలు జన్మించగా ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కరణ్ పేరుని బర్త్ సర్టిఫికెట్ లో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆది వారం కరణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. అయితే కరణ్ అవివాహితుడు కావటంతో తల్లి పేరును మాత్రం తెలపలేదు. శుక్రవారం (మార్చి 3) రోజు ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఇద్దరు పిల్లల పేర్లను రిజిస్టర్ చేయించాడు. కరణ్ తన ఆటోబయోగ్రఫీలో పిల్లలను దత్తత తీసుకుంటాను లేదంటే సరోగసి ద్వారా పిల్లలకు తండ్రిని అవుతాను అని చెప్పాడు. తాజాగా ఆ మాటలను నిజం చేస్తూ కరణ్ తండ్రి అయ్యాడన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కూడా ఇటీవల ఇదే బాటలో సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. pic.twitter.com/OyGb4SnwId — Karan Johar (@karanjohar) 5 March 2017 -
వివాహం వద్దు వారసుడు కావాలి
ట్రెండ్ అతడు పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కాని తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. ఆమెకు పెళ్లంటే అయిష్టం. కాని తల్లి కావాలనుకుంటోంది. అతను కాని ఆమె కాని డబ్బు ఖర్చు పెడితే చాలు. అద్దె గర్భం ద్వారా బిడ్డను కని సింగిల్ పేరెంట్స్ అయిపోతున్నారు. వైవాహిక వ్యవస్థ ఉలిక్కి పడేలా మొదలైన ఈ ట్రెండ్ తుషార్ కపూర్ నిర్ణయంతో కుతూహలం రేపుతోంది. పెళ్లికి నో అన్న తుషార్ అద్దె గర్భంతో తాజాగా తండ్రయ్యాడు. మాతృత్వం ఎప్పుడూ తల్లికే అపాదిస్తారు. కన్నతల్లికే మాతృహృదయం ఉంటుందని అంటారు. పిల్లలు తల్లిపాలు తాగి తల్లి ఒడిలో ఎదగాలని చెప్తారు. లాల పోసి, గోరు ముద్దలు తినిపించి, జోలపాట పాడి... ఇవన్నీ అమ్మ డ్యూటీలే. వక్షంలో పాలు ఉండటం ఆమెకూ బిడ్డకూ మధ్య అవినాభావ సంబంధాన్ని ఏర్పరచింది. తండ్రి బయట వరకే ఉంటాడు. ఎత్తుకొని ఆడిస్తాడు. బజారుకు తీసుకెళతాడు. పెంపకంలో సాయపడి విద్యాబుద్ధులకు సహకరిస్తాడు. అందుకే విడాకుల కేసుల్లో చాలా మటుకు పిల్లల పెంపకం బాధ్యత తల్లికే అప్పగిస్తుంటాయి కోర్టులు. తల్లితో పెరగడంలోని వికాసం తండ్రితో పెరగడంలో ఉండదు అని భావించడం వల్ల కొనసాగుతున్న భావన ఇది. ఇప్పుడు మారింది... అయితే ఇప్పుడు కాలం మారింది. తండ్రులు తమ బిడ్డల పెంపకాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తున్నారు. ఒకవేళ విడాకులు మంజూరైతే బిడ్డల పెంపకం తీసుకోవడానికి వారు వెనుకాడటం లేదు. మరోవైపు పెళ్లికాని పురుషులు లేదా పెళ్లి చేసుకోవాలనుకోని పురుషులు కూడా పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రతి పురుషుడిలోనూ తండ్రిగా మారమని చెప్పే సహజాతాలుంటాయి కనుక తండ్రిగా ఉండాలనుకునే ఇచ్ఛ వారిని దత్తత వైపు ప్రేరేపిస్తోంది. అయితే స్త్రీలకు ఈ విషయంలో ఉన్న అనుకూలత స్త్రీలకు లేదు. పెళ్లి కాని పురుషులు దత్తత కోసం వస్తే వారిని సందేహించడమే కనిపిస్తుంది. ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకున్నాక ఆ పిల్లలను ఇతరత్ర ఏమన్నా ఉపయోగిస్తారా? వంటి సందేహాలు ఉన్నాయి. హిందూధర్మం కూడా వివాహిత దంపతులే దత్తత తీసుకోవాలని సూచిస్తుంది. మరి దీనికి విరుగుడు? సరొగసీ... ఇంతకు ముందు బిడ్డలు పుట్టడంలో ఇబ్బందులు ఉన్న భార్యాభర్తలు, లేదా పిల్లలు కనడానికి వృత్తి రీత్యా లేదా ఆరోగ్యం రీత్యా వీలు లేని శ్రీమంతులు అద్దె గర్భాల ద్వారా పిల్లలను కనడం చూశాం. ఇప్పుడు బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ఉదంతంలో అవివాహితుడిగా ఉంటూ తండ్రిగా మారడం గమనించాం. ప్రసిద్ధ హిందీ నటుడు జితేంద్ర కుమారుడైన తుషార్ కపూర్ అవివాహితుడు. అతడికి ప్రస్తుతం 40 నిండుతున్నాయి. పెళ్లి పట్ల సముఖంగా లేని తుషార్ తండ్రిగా ఉండాలనే ఇచ్ఛను మాత్రం వదలుకోదల్చుకోలేదు. ఒకసారి తిరుమలలో దర్శనం కోసం వేచి ఉన్నప్పుడు దర్శకుడు ప్రకాష్ ఝా అతడూ కలుసుకున్నాడు. ప్రకాష్ ఝా తాను అద్దె గర్భం ద్వారా ఒక కూతురిని కన్నానని, నీకు తండ్రి కావాలంటే అదే మంచి పద్ధతి అని తుషార్‌కు చెప్పాడు. తుషార్‌కు ఈ ఆలోచన నచ్చింది. వెంటనే ముంబై జస్లోక్ ఆస్పత్రిలో కృత్రిమ గర్భధారణ విభాగాధిపతిని కలుసుకున్నాడు. అంతవరకూ అలాంటి ఆలోచనతో వచ్చిన మగవాళ్లు లేరు. కాని తుషార్‌లో తండ్రి కావాలనే భావనను గమనించిన ఆ విభాగాధిపతి డాక్టర్ ఫిరూజా పారిక్ అందుకు అంగీకరించి అద్దె గర్భం ద్వారా తండ్రి కావచ్చునని సూచించింది. మిగిలిన లాంఛనాలన్నీ ఆస్పత్రి వర్గాలే చేశాయి. వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే ఆ అద్దెగర్భం ఇస్తున్న మహిళ ఎవరో తుషార్‌కు తెలియనివ్వకుండా ఉంచడం. తొమ్మిది నెలల పాటు తుషార్ తనకు పుట్టబోయే బిడ్డ బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నాడు. గడువు ముగిశాక కొడుకు పుట్టడంతో పొంగిపోయాడు. ఆ కొడుకు ఇంటికొచ్చాకే బయటి ప్రపంచానికి ఆ వివరాలు తెలియచేశాడు. పెళ్లిలో సెగే కారణమా... ఇవాళ్టి యువత పెళ్లికి భయపడుతోందా? జీవిత భాగస్వామితో వేగలేనని భావిస్తోందా? లేకుంటే మొదట పెళ్లికి భయపడి లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఆ రిలేషన్ కూడా భారమని భావించి ఏకంగా ఒంటరిగా జీవిస్తూ అద్దె గర్భంతో తల్లిగానో తండ్రిగానో మారాలని అభిలషిస్తోంది. ఇది ప్రతి సమూహం గమనించి తమ సమూహాలలోని పెళ్లిళ్లను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తోంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎదుటి మనిషిని భరించడం నేర్పడం లేదా? సహించడం నేర్పడం లేదా? జీవిత భాగస్వామిని ఆ భాగస్వామి తప్పొప్పులతో పాటు స్వీకరించే పరిణితిని ఇవ్వడం లేదా? జీవిత భాగస్వామిని ఆ భాగస్వామి కుటుంబ సభ్యులతో సహా గౌరవించే సంస్కారం ఇవ్వడం లేదా? డబ్బు, కట్నం... వీటి కోసం కీచులాటల వల్ల విడాకుల కంటే కలిసి బతకడంలోని వైఫల్యమే నేటి యువతను వివాహం అనగానే విముఖత కలిగేలా చేస్తున్నాయా? భవిష్యత్తు ఏమిటి? అద్దె గర్భాల ద్వారా స్త్రీలు తల్లులుగా, పురుషులు తండ్రులుగా మారుతుంటే ఆ పిల్లల పెరుగుదల ఎలా ఉంటుంది? తల్లిదండ్రులలో ఎవరిదో ఒకరి ప్రేమే పొందుతుంటే ఆ పిల్లల వికాసం ఎలా ఉంటుంది? అలా పెరిగి పెద్ద అయిన వారి వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఎలా ఉం టుంది? ఇవన్నీ సందేహాలే. అయితే నూటికి ఒకటో రెండో శాతం మంది మాత్రమే ఈ దారిన నడుస్తున్నారని భారతీయ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉందని భావించేవారు ఉన్నారు. కాని స్పీడు యుగం, పోటీ ప్రపంచం స్త్రీ పురుషులను తల్లిదండ్రులుగా మార్చడానికి తల్లిదండ్రులుగా కలిసి ఉంటూ పిల్లలను పెంచడానికి అడ్డంకులు కల్పిస్తున్నదనడం వాస్తవం. ధోరణి ఇలాగే ఉంటే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో మదర్/ ఫాదర్ అని రెండు గడులు ఉండవు. సింగిల్ పేరెంట్ నేమ్ అని ఉంటుంది. అది మాత్రం తథ్యం. తుషార్ కొడుకు ‘లక్ష్యా’పరు లక్ష్యా... తుషార్ తన కొడుకు పేరును లక్ష్యా అని పెట్టాడు. తను అచ్చు నాలానే ఉన్నాడు... అందువల్ల కూడా నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నాను అని అతడు పత్రికల వారికి చెప్పాడు. తుషార్ నిర్ణయానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అని తుషార్ తల్లిదండ్రులు జితేంద్ర, శోభా కపూర్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలియచేశారు. జితేంద్రకు తుషార్ కాకుండా కుమార్తె ఏక్తా ఉన్న సంగతి విదితమే. ఆమె కూడా వివాహం చేసుకోలేదు. ‘ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. అమ్మా నాన్న చెల్లెలు, నేను నా కొడుకు లక్ష్యా... మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని తుషార్ అన్నాడు. తుషార్ ఇలాంటి ఆలోచన చేశాడని తెలియని బాలీవుడ్ మిత్రులు కూడా ఈ వార్తతో ఎంతో ఆశ్చర్యం ప్రకటించారు. తుషార్ నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు తెలిపారు. జస్లోక్ ఆస్పత్రి వర్గాలు కూడా ‘తుషార్ లాంటి సెలబ్రిటీ తీసుకున్న నిర్ణయం ఎక్కువ మందికి చేరి అవివాహిత పురుషులు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నాం’ అంటున్నాయి. -
సన్నీలియోన్‌పై మరో కేసు నమోదు!
కొత్త సినిమా విడుదల అవుతోందని సంబరంగా ఉన్న సన్నీ లియోన్.. ఇప్పుడు కష్టాల్లో పడింది. ఆమెతోపాటు సినిమాలో నటించిన తుషార్ కపూర్, వీర్ దాస్ తదితరులపై ఓ కేసు నమోదైంది. మిలాప్ జవేరీ తీసిన 'మస్తీజాదే' సినిమాలో నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది మీద కూడా ఈ కేసు దాఖలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. మస్తీజాదే సినిమాలో ఓ ఆలయంలో చాలా అసభ్యకరమైన రీతిలో కండోమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంతో సెంటిమెంట్లను దెబ్బతీశారంటూ ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ పోలీసు స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు లెక్కలేనన్ని కత్తెరలు వేస్తే తప్ప విడుదలకు ఆమోదం తెలపలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్తగా కేసు కూడా నమోదు కావడంతో ఇక ఏం చేస్తారో చూడాలి. -
నో డేటింగ్!
రెండు రోజులు కలసి తిరిగితే చాలు... లేదంటే ఓ సినిమాలో కాస్త కెమెస్ట్రీ పండిస్తే చాలు... ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని గుసగుసలాడేస్తారేంటనేది మరాఠీ గుమ్మ రాధికా ఆప్టే ప్రశ్న. ఇంతకీ ఈ పురాణమెందుకు చెప్పిందనేగా..! ‘షోర్ ఇన్ ద సిటీ’లో తుషార్ కపూర్‌తో స్క్రీన్ పంచుకున్న ఈ సుందరి... అతడితో రియల్ లైఫ్ రొమాన్స్ కూడా చేసేస్తోందని మరాఠీ ఇండస్ట్రీలో టాక్. ఇదే విషయాన్ని అమ్మడిని అడిగితే... ‘నిజంగా ఇది సిల్లీ ప్రశ్న. అతడితో సినిమా తరువాత నేను నేరుగా లండన్ వెళ్లిపోయా. అసలు తుషార్ ఫోన్ నంబర్ కూడా నా దగ్గర లేదు’ అంటూ అమాయకంగా చెప్పేసింది రాధిక.


