‘అవును 16 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవ్‌’ | Sunny Deol Not Talking To Shah Rukh Khan For 16 Years | Sakshi
Sakshi News home page

షారుక్‌, నేను మాట్లాడుకోవడం లేదు : సన్నీ డియోల్‌

Jun 18 2019 9:31 AM | Updated on Jun 18 2019 11:20 AM

Sunny Deol Not Talking To Shah Rukh Khan For 16 Years - Sakshi

16 ఏళ్లుగా షారుక్‌ ఖాన్‌కు, తనకు మధ్య మాటల్లేవ్‌ అంటున్నార్‌ బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సన్నీ డియోల్‌. 1993లో యశ్‌చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘డర్‌’ సినిమాలో షారుక్‌, సన్నీ డియోల్‌ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా వీరి మధ్య వివాదం తలెత్తింది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య మాటల్లేవ్‌. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సన్నీ డియోల్‌ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. డర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో యశ్‌ చోప్రా, షారుక్‌ మిమ్మల్ని చూసి భయపడ్డారా అని ప్రశ్నించగా.. అవును నేను అలానే అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు తప్పు వారిదే అన్నారు సన్నీ.

ఆనాడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు సన్నీ డియోల్‌. ‘ఆ రోజు షూటింగ్‌లో షారుక్‌ నన్ను పొడిచే సన్నివేశం ఉంది. దాని గురించి యశ్‌ చోప్రాకు నాకు మధ్య సీరియస్‌ డిస్కషన్‌ జరగుతుంది. సినిమాలో నేను కమాండో పాత్ర పోషిస్తున్నాను. అంటే చాలా స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా ఉంటాను. అలాంటిది ఆ కుర్రాడు(షారుక్‌) నన్ను అంత తేలిగ్గా ఎలా కొట్ట గల్గుతాడు’ అని యశ్‌ జీని ప్రశ్నించాను. ‘నేను అతడిని గమనించనప్పుడు మాత్రమే నన్ను కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ నేను చూస్తుండగానే అతడు నన్ను కత్తితో పొడిస్తే.. నేను కమాండోను ఎలా అవుతాను. ఇదే విషయాన్ని యశ్‌ చోప్రాకు వివరించే ప్రయత్నం చేశా’ అన్నాడు.

‘కానీ ఆయన నా మాట పట్టించుకోలేదు. యశ్‌ జీ వయసులో నా కన్నా పెద్ద వ్యక్తి. అతడ్ని నేను చాలా గౌరవించా, తిరిగి ఎదురుచెప్పలేదు. చాలా కోపం రావడంతో నా చేతుల్ని నా పాకెట్‌లో పెట్టుకున్నా. తర్వాత కోపం ఇంకా ఎక్కువైపోయింది. నాకు తెలియకుండానే నా జేబు చించేశాను’ అంటూ అనాడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు సన్నీ డియోల్‌. ‘16 ఏళ్లుగా మీరు షారుక్‌తో మాట్లాడటం లేదా ’ అని ప్రశ్నించగా.. ‘నేను మాట్లాడలేదు. వారి నుంచి దూరంగా వచ్చేశానంతే. నేను ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిని కాదు. కాబట్టి మేం ఎప్పుడూ ఒకరికొకరం ఎదురుపడలేదు. ఇక మాట్లాడాల్సిన అవసరం ఏం ఉంది’ అన్నారు సన్నీ డియోల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement