ఎన్టీఆర్ సినిమాలో కామెడీ హీరో..! | Sunil Special role in Ntr trivikram Movie | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సినిమాలో కామెడీ హీరో..!

Oct 25 2017 1:22 PM | Updated on Oct 25 2017 1:22 PM

Sunil Special role in Ntr trivikram Movie

జై లవ కుశ సినిమాతో నటుడిగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన యంగ్ హీరో ఎన్టీఆర్, తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను లాంచనంగా ప్రారంభించాడు. ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే కరెక్ట్ అని భావిస్తున్నారు చిత్రయూనిట్.

ఇప్పటికే ఈ పాత్రకు నారావారబ్బాయి రోహిత్ ను తీసుకున్నారన్న టాక్ గట్టిగా వినిపించింది. నందమూరి, నారా కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే పబ్లిసిటీ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం నారా రోహిత్ స్థానంలో కామెడీ హీరో సునీల్ ను తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. హీరోగా మారిన తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సునీల్, ఇటీవల సపోర్టింగ్ రోల్స్ కు రెడీ అంటూ ప్రకటించేశాడు.

చాలా కాలంగా సునీల్ కు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్న ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమాతో ఆ కోరిక తీర్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి సునీల్ పాత్రపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement