చిత్రలహరిలో సునీల్‌..?

Sunil In Sai Dharam Tej Chitralahari - Sakshi

కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్‌ తీసుకున్న సునీల్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. హీరోగా చేసిన సినిమాలన్నీ వరుగా బోల్తా పడటంతో తిరిగి కామెడీ రోల్స్‌పై దృష్టిపెట్టాడు సునీల్. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి సిల్లీఫెలోస్‌ సినిమాలో నటిస్తున్న సునీల్‌, మరికొన్ని సినిమాలో క్యారెక్టర్‌ రోల్స్‌లో నటించేందుకు అంగీకరించాడు.

తాజాగా ఈ కామెడీ స్టార్‌ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. నేను శైలజ ఫైం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘చిత్రలహరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌’ సినిమాతో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, రితికా సింగ్‌లు హీరోయిన్లుగా  నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top