జక్కన్న అయినా హిట్ ఇస్తాడా..? | sunil next movie details | Sakshi
Sakshi News home page

జక్కన్న అయినా హిట్ ఇస్తాడా..?

Jun 21 2016 9:41 AM | Updated on Sep 4 2017 3:02 AM

జక్కన్న అయినా హిట్ ఇస్తాడా..?

జక్కన్న అయినా హిట్ ఇస్తాడా..?

కమెడియన్ కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే హీరోగా టర్న్ తీసుకున్ననటుడు సునీల్. కథానాయకుడిగా మారిన తరువాత ఒకటి రెండు సినిమాలతో పరవాలేదని పించినా., తరువాత మాత్రం..

కమెడియన్ కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే హీరోగా టర్న్ తీసుకున్న నటుడు సునీల్. కథానాయకుడిగా మారిన తరువాత ఒకటి రెండు సినిమాలతో పరవాలేదనిపించినా, తరువాత మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రొటీన్ క్యారెక్టర్లతో బోర్ కొట్టిస్తున్న ఈ భీమవరం బుల్లోడు సరైన సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో కలిసి చేసిన కృష్ణాష్టమి కూడా నిరాశపరచటంతో తన తదుపరి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ప్రస్తుతం సునీల్, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో జక్కన్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ మార్క్ కామెడీ కూడా బాగానే ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా మీద పాజిటివ్ టాక్ క్రియేట్ చేసిన రిజల్ట్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. రక్ష సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వంశీకృష్ణకు కూడా జక్కన్న సక్సెస్ చాలా కీలకం. మరి రాజమౌళి పేరుతో వస్తున్న ఈ సినిమా అయినా సునీల్ కెరీర్ ను గాడిలో పెడుతుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement