భీమవరంలో సందడి చేయనున్న బుల్లోడు | sunil new flick "bheemavaram bullodu" | Sakshi
Sakshi News home page

భీమవరంలో సందడి చేయనున్న బుల్లోడు

Dec 20 2013 12:28 AM | Updated on Sep 2 2017 1:46 AM

భీమవరంలో సందడి చేయనున్న బుల్లోడు

భీమవరంలో సందడి చేయనున్న బుల్లోడు

ఈ సినిమాలో ఓ కోణంలో అమాయకంగా, మరో కోణంలో ధైర్యంగా కనిపిస్తాను. పొట్ట చెక్కలయ్యే కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది.

 ‘‘ఈ సినిమాలో ఓ కోణంలో అమాయకంగా, మరో కోణంలో ధైర్యంగా కనిపిస్తాను. పొట్ట చెక్కలయ్యే కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. నా కెరీర్‌లో మైలురాయిలా నిలిచే సినిమా ఇది’’ అని సునీల్ అన్నారు. ‘కలిసుందాం రా’ ఫేం ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘భీమవరం బుల్లోడు’. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 22న భీమవరంలో ఈ చిత్రం పాటల్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇటీవలే తెరకెక్కించిన ప్రమోషనల్ సాంగ్‌నిత్వరలోనే విడుదల చేస్తాం.
 
 విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పెళ్లికానీ కుర్రాడు, ప్రేమ జ్వరం ఉన్నోడు, స్నేహమంటే ప్రాణమిచ్చేవాడు... ఇది భీమవరం బుల్లోడి నైజం. సునీల్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అన్నారు. ఇంకా అనూప్‌రూబెన్స్, శ్రీధర్ సీపన, చంద్రబోస్ తదితరులు మాట్లాడారు. కెమెరామేన్ సంతోష్‌రాయ్, కొరియోగ్రఫర్ భాను, సయాజీ షిండే, సామ్రాట్, పృథ్వీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement