బర్త్‌డే సర్‌ప్రైజ్‌

Suniel Shetty to star in Manchu Vishnu film release date fix - Sakshi

తెలుగు, ఇంగ్లిష్‌  భాషల్లో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు మంచు విష్ణు. టాలీవుడ్‌–హాలీవుడ్‌ క్రాస్‌ఓవర్‌ (రెండు వేరు వేరు ప్రాంత నటులు కలిసి నటించడాన్ని క్రాస్‌ఓవర్‌ అంటారు) ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారట చిత్రబృందం. జెఫ్రీ చిన్‌ దర్శకత్వంలో విష్ణు మంచు, కాజల్, రుహానీ శర్మ, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, టైటిల్‌ను మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమాతో  తొలిసారి తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు హిందీ నటుడు సునీల్‌ శెట్టి. మరో విశేషం ఏంటంటే  విష్ణు, కాజల్‌ అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారట. నవదీప్, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ కుమార్‌ ఆర్, ప్రొడక్షన్‌ డిజైన్‌: కిరణ్‌ కుమార్‌ ఎమ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top