లక్ష్యసాధనలో... జక్కన్న | suneel released jakkanna motion poster and title | Sakshi
Sakshi News home page

లక్ష్యసాధనలో... జక్కన్న

Mar 18 2016 11:18 PM | Updated on Sep 3 2017 8:04 PM

లక్ష్యసాధనలో... జక్కన్న

లక్ష్యసాధనలో... జక్కన్న

‘రాళ్లను శిల్పాలుగా చెక్కి అమరశిల్పి జక్కన్న ఎంతో కీర్తి పొందారు.

‘రాళ్లను శిల్పాలుగా చెక్కి అమరశిల్పి జక్కన్న ఎంతో కీర్తి పొందారు. ఎందుకూ పనికి రాడనుకున్న వాడు గొప్ప గొప్ప పనులు చేసి లక్ష్యసాధనలో ఎలా విజయం సాధించాడన్నదే ఈ సినిమా ముఖ్య కథాంశం’’ అని హీరో సునీల్ చెప్పారు. సునీల్, మన్నార్ చోప్రా జంటగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జక్కన్న’. ఈ సినిమా టైటిల్‌ను, మోషన్ పిక్చర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. కెమేరామ్యాన్ సి. రామ్‌ప్రసాద్, సంగీత దర్శకుడు దినేశ్, మాటల రచయితలు భవానీ ప్రసాద్, జీఆర్ మహర్షి, నటులు రాజా రవీంద్ర, సప్తగిరి, సహ నిర్మాతలు ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement