మా సినిమాకు పేరు పెట్టండి..! | sundeep kishan publicity plan for his next | Sakshi
Sakshi News home page

మా సినిమాకు పేరు పెట్టండి..!

Feb 9 2016 2:47 PM | Updated on Sep 15 2019 12:38 PM

మా సినిమాకు పేరు పెట్టండి..! - Sakshi

మా సినిమాకు పేరు పెట్టండి..!

సినిమాను ప్రమోట్ చేసుకోవటం కోసం అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇప్పటికే పబ్లిసిటీలో కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్న సినీ ప్రముఖులు...

సినిమాను ప్రమోట్ చేసుకోవటం కోసం అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇప్పటికే పబ్లిసిటీలో కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్న సినీ ప్రముఖులు ఇప్పుడు మరో కొత్త తరహా ప్రచారానికి తెరలేపారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమా నేరం రీమేక్కు ప్రేక్షకులనే టైటిల్ నిర్ణయించాలంటూ కోరాడు సందీప్ కిషన్.

గతంలో జెడి చక్రవర్తి హీరోగా తెరకెక్కిన 'పాపే నా ప్రాణం' సినిమా విషయంలో కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. తాజాగా సందీప్ కిషన్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. సినిమా ఎలా ఉండబోతుందో పరిచయం చేసేలా రూపొందించిన పోస్టర్తో పాటు చిత్రయూనిట్ సెలెక్ట్ చేసిన ఐదు టైటిల్స్ను ఎనౌన్స్ చేసిన సందీప్, వీటిలో ఒక పేరు సెలెక్ట్ చేయాలని అభిమానులను కోరాడు. ఎక్కువ మంది సెలెక్ట్ చేసిన టైటిల్నే సినిమాకు ఫైనల్ చేస్తామంటూ తెలిపాడు. మరి సందీప్ ప్లాన్ సినిమా పబ్లిసిటీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

ప్రస్తుతం ఒక అమ్మాయి తప్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ త్వరలోనే నేరం రీమేక్ను స్టార్ చేయనున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మిస్టర్ నూకయ్య ఫేం అనీల్ కృష్ణ దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించనున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement