breaking news
Neram
-
మా సినిమాకు పేరు పెట్టండి..!
సినిమాను ప్రమోట్ చేసుకోవటం కోసం అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇప్పటికే పబ్లిసిటీలో కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్న సినీ ప్రముఖులు ఇప్పుడు మరో కొత్త తరహా ప్రచారానికి తెరలేపారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమా నేరం రీమేక్‌కు ప్రేక్షకులనే టైటిల్ నిర్ణయించాలంటూ కోరాడు సందీప్ కిషన్. గతంలో జెడి చక్రవర్తి హీరోగా తెరకెక్కిన 'పాపే నా ప్రాణం' సినిమా విషయంలో కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. తాజాగా సందీప్ కిషన్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. సినిమా ఎలా ఉండబోతుందో పరిచయం చేసేలా రూపొందించిన పోస్టర్‌తో పాటు చిత్రయూనిట్ సెలెక్ట్ చేసిన ఐదు టైటిల్స్‌ను ఎనౌన్స్ చేసిన సందీప్, వీటిలో ఒక పేరు సెలెక్ట్ చేయాలని అభిమానులను కోరాడు. ఎక్కువ మంది సెలెక్ట్ చేసిన టైటిల్‌నే సినిమాకు ఫైనల్ చేస్తామంటూ తెలిపాడు. మరి సందీప్ ప్లాన్ సినిమా పబ్లిసిటీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఒక అమ్మాయి తప్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ త్వరలోనే నేరం రీమేక్‌ను స్టార్ చేయనున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మిస్టర్ నూకయ్య ఫేం అనీల్ కృష్ణ దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించనున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. Zeroed down to 5 options :) Meere final chesi pettali :) #NeramRemake @AnilSunkara1 @anikanneganti @anishaambrose :) pic.twitter.com/Ujql10YAdQ — Sundeep Kishan (@sundeepkishan) February 7, 2016 -
మూడు సినిమాలు లైన్లో పెట్టాడు
యంగ్ జనరేషన్ హీరోల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా ఎదుగుతున్న హీరో సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ మీద కూడా దృష్టి పెట్టిన సందీప్ కిషన్, హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇంట్రస్ట్రింగ్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతున్న సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న సందీప్, తాజాగా మరో సినిమాకు అంగీకరించాడు. 'ఒక అమ్మాయి తప్ప' సినిమాను పూర్తి చేసిన సందీప్ కిషన్, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ 'నేరం' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ఫైనల్ చేశాడు. నారా రోహిత్ హీరోగా రూపొందిన ప్రతినిథి సినిమాకు రచయితగా పనిచేసిన ఆనంద్ రవి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. 'సినిమా చూపిస్త మామ' లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు.