మూడు సినిమాలు లైన్లో పెట్టాడు | sundeep kishan busy with three films | Sakshi
Sakshi News home page

మూడు సినిమాలు లైన్లో పెట్టాడు

Feb 4 2016 9:40 AM | Updated on Sep 15 2019 12:38 PM

మూడు సినిమాలు లైన్లో పెట్టాడు - Sakshi

మూడు సినిమాలు లైన్లో పెట్టాడు

యంగ్ జనరేషన్ హీరోల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్గా ఎదుగుతున్న హీరో సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ మీద కూడా దృష్టి పెట్టిన సందీప్ కిషన్, హిట్ ప్లాప్లతో సంబందం లేకుండా వరుస...

యంగ్ జనరేషన్ హీరోల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్గా ఎదుగుతున్న హీరో సందీప్ కిషన్. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ మీద కూడా దృష్టి పెట్టిన సందీప్ కిషన్, హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇంట్రస్ట్రింగ్ కాన్సెప్ట్లతో తెరకెక్కుతున్న సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.  ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న సందీప్, తాజాగా మరో సినిమాకు అంగీకరించాడు.

'ఒక అమ్మాయి తప్ప' సినిమాను పూర్తి చేసిన సందీప్ కిషన్, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ 'నేరం' రీమేక్లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ఫైనల్ చేశాడు. నారా రోహిత్ హీరోగా రూపొందిన ప్రతినిథి సినిమాకు రచయితగా పనిచేసిన ఆనంద్ రవి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు.  'సినిమా చూపిస్త మామ' లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement