మీ ఒక్క అమ్మాయి ఎవరు? | sundeep kishan asks fans to tell about okka ammayi | Sakshi
Sakshi News home page

మీ ఒక్క అమ్మాయి ఎవరు?

Jun 6 2016 7:03 PM | Updated on Sep 15 2019 12:38 PM

మీ ఒక్క అమ్మాయి ఎవరు? - Sakshi

మీ ఒక్క అమ్మాయి ఎవరు?

తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హీరో సందీప్ కిషన్ ట్విట్టర్‌ మీద పడ్డాడు. దాంతో పాటు ఫ్యాన్స్‌కు మంచి బహుమతి కూడా ఆఫర్ చేశాడు. తాను వేసిన ప్రశ్నకు మంచి సమాధానం చెప్పినవాళ్లకు ఆ బహుమతి ఇస్తానన్నాడు.

తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హీరో సందీప్ కిషన్ ట్విట్టర్‌ మీద పడ్డాడు. దాంతో పాటు ఫ్యాన్స్‌కు మంచి బహుమతి కూడా ఆఫర్ చేశాడు. తాను వేసిన ప్రశ్నకు మంచి సమాధానం చెప్పినవాళ్లకు ఆ బహుమతి ఇస్తానన్నాడు. సందీప్ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. కొత్త దర్శకుడు తాడినాడ రాజసింహ దర్శకత్వంలో అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా కోసం టాలీవుడ్, కోలీవుడ్ జంటలన్నింటినీ సందీప్ కిషన్ వాడుకున్నాడు.

అమల - నాగార్జునతో మొదలుపెట్టి మహేష్ - నమ్రత వరకు నాలుగు జంటలను తీసుకున్న సందీప్.. తన సినిమా విడుదలయ్యే జూన్ 10వ తేదీని సింబాలిక్‌గా చూపిస్తూ, ఆరోజు ఒక ప్రతిజ్ఞ చేయాలని.. 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్' అని చెబుతూ.. 'ఒక్క అమ్మాయి తప్ప' అని ప్రతి ఒక్కరూ అనుకుంటారన్న రీతిలో తన ప్రమోషన్ డిజైన్ చేయించాడు. బాలీవుడ్, కోలీవుడ్ జంటల ఫొటోలను రెండు కాఫీ కప్పుల మీద ముద్రించి... 'ఆ ఒక్క అమ్మాయి తప్ప' అంటూ వరుస ట్వీట్లు చేశాడు. నాగార్జున - అమల, మహేష్ - నమ్రత, సూర్య - జ్యోతిక, అజిత్ - షాలిని జంటల ఫొటోలను పోస్ట్ చేసి.. మీ ఒక్క అమ్మాయి ఎవరు అన్న ప్రశ్న సంధించాడు. మంచి సమాధానం చెప్పినవాళ్లకు తనతో కలిసి సినిమా చూసే అవకాశం ఉంటుందని కూడా చెప్పాడు. మరి ఆ లక్కీ ప్రేక్షకులు ఎవరో చూడాలి.

 

Advertisement
 
Advertisement
Advertisement