ఉగాదితో పాటు భారీ సినిమాల సమ్మర్ పండగ కూడా ఇవాళ్టి నుంచే!
ఉగాది... కొత్త సంవత్సరానికి శుభారంభం. ఈ పండుగతో పాటు ఇవాళ్టి నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు మరో పండుగ కూడా మొదలైంది.
‘సర్దార్...’ సందడి
నిజానికి, రెండు వారాల క్రితం నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ ‘ఊపిరి’తోనే ఈ సమ్మర్ సినీ సీజన్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. పవన్‌కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజ్‌తో, సమ్మర్ సీజన్ సినిమా రిలీజ్‌ల పండుగ నిజమైన భారీ స్థాయికి చేరింది. ఇక ఇప్పటి నుంచి రెండేసి వారాల గ్యాప్‌లో ఒక్కో పెద్ద హీరో సినిమా వస్తోంది. తెలుగు, హిందీల్లో కలిపి, దేశం మొత్తం మీద రికార్డు సంఖ్యలో 2 వేలకు పైగా హాళ్లలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజవుతోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల్లో జనం ముందుకు వెళుతోంది. ఇందులో 23 దేశాల్లో మొదటిసారిగా ఒక తెలుగు సినిమా రిలీజవు తోంది. అందుకే, ‘సర్దార్...’ పర్ఫెక్ట్ సినిమా పండగ హంగామానే.
రెండేసి వారాల గ్యాప్‌లో...
పెద్ద హీరో, పెద్దయెత్తున రిలీజ్లు కాబట్టి సహజంగానే ఎవరూ పోటీకి దిగరు. భారీ మొత్తాల్ని పణంగా ఒడ్డడం వల్ల, ఆ సొమ్మును వెనక్కి రాబట్టడానికి పెద్ద సినిమాల మధ్య ఒకటికి రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుం టున్నారు. అందుకే, పవన్ కల్యాణ్ వచ్చిన రెండు వారాల తర్వాతే ఏప్రిల్ 22న బోయపాటి దర్శక త్వంలో అల్లు అర్జున్ ‘సరైనోడు’గా రానున్నారు.
ఇక, తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘తెరి’ అక్కడ తమిళ ఉగాదికి ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ‘దిల్’ రాజు తెలుగులో ‘పోలీసోడు’గా అందిస్తున్న ఈ సినిమాను మాత్రం ఏకకాలంలో రిలీజ్ కోసం ఇక్కడా ఏప్రిల్ 14నే విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నారు.
మే నెలలో... ఒకటికి మూడు
తెలుగుతో పాటు మలయాళంలోనూ మాస్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ సినిమా తర్వాత రెండు వారాల గ్యాప్ చూసుకొని, మే 6న నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘అ...ఆ...’. ఇప్పటికే 2 పాటలు మినహా షూటిం గంతా పూర్తయిన ఈ సినిమా ఆ డేట్‌కి రిలీజవడా నికి చురుగ్గా సన్నాహాలు చేసుకుంటోంది.
మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ కూడా ఇంకా షూటింగ్ హంగామాలో ఉంది. ఏప్రిల్ ఆఖరు కల్లా రిలీజని మొదట అనుకున్న ఈ సినిమా ఇప్పుడు మే నెల రెండు, మూడు వారాలకు వచ్చే సూచనలున్నట్లు కృష్ణానగర్ వర్గాల కబురు.
వీటి మధ్య సందు చూసుకొని, మే నెలలోనే సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ రిలీజ్‌కు నిర్మాత ‘దిల్’ రాజు సిద్ధమవుతున్నారు. అంటే, నడి వేసవిలో ఒకటికి మూడు రిలీజులు రానున్నాయి.
తెలుగునాట... తమిళ స్టార్స మాట...
ఈ వేసవిలో ఇద్దరు తమిళ సూపర్స్టార్ల చిత్రాలూ రిలీజవుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ చిత్రం ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. మరోపక్క సూర్య హీరోగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’ కూడా తుదిమెరుగుల్లో ఉంది. అయితే, తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, హంగామా నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రాల రిలీజ్ డేట్లు ఇంకా పక్కాగా నిర్ధారణ కాలేదు. జూన్‌లో కానీ ఇవి రిలీజ్ కావని ఒక టాక్. ఈ పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాల రిలీజ్లు అనేకం.
అన్ని పండగలూ ఒకేసారి!
సరిగ్గా ఇవాళ్టి నుంచే ఐ.పి.ఎల్. క్రికెట్ సీజన్ కూడా మొదలవుతోంది. అంటే అన్ని పండగలూ ఒకేసారి వచ్చేశాయన్న మాట. వెరసి, రాగల కొద్ది వారాల పాటు పిల్లలకు సెలవులు, కొత్త రిలీజ్‌ల కోలాహలం, నరాలు తెగే ఉత్కంఠ నిండిన క్రికెట్ మ్యాచ్‌ల సందడి - ఒకటే హంగామా. అందుకే, గురూ... ఇవాళ్టి నుంచే పండగ షురూ. ఈ వినోదాల విందుకు ఆర్ యూ రెడీ.
గురూ! పండగ షురూ!
Published Thu, Apr 7 2016 11:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement