breaking news
Summer Movie Season
-
వేసవి రేసుకు రెడీ అంటున్న స్టార్స్ వీళ్లే..
2020, 2021... ఈ రెండేళ్లు వేసవిలో సినిమా సంబరం లేకుండాపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గతేడాది, సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది వేసవికి సినిమాలు థియేటర్లకు రాలేదు. కానీ వచ్చే ఏడాది వేసవిలో వసూళ్ల సందడి ఉంటుందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాల విడుదల ప్రకటనలు సమ్మర్‌ను టార్గెట్ చేస్తుండడమే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పటివరకూ ప్రకటించిన ప్రకారం వచ్చే వేసవి రేసుకి రెడీ అయిన స్టార్స్ ఎవరంటే... ‘బాహుబలి’ అద్భుత విజయం ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేస్తే, ‘కేజీఎఫ్’ సూపర్ హిట్టయి, అగ్ర హీరోలతో సినిమాలు చేసే దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ పేరును చేర్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక 11 ఏళ్ల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి చేయనున్న సినిమా ప్రకటన ఇటీవల అధికారికంగా వచ్చింది. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇంతకుముందు మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తామని కొరటాల ఇప్పటికే వెల్లడించారు. వీరితో పాటు ఇతర స్టార్స్ కూడా సమ్మర్ రేసులో నిలవడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మరి... ఈ కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుంది? అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. -
గురూ! పండగ షురూ!
ఉగాదితో పాటు భారీ సినిమాల సమ్మర్ పండగ కూడా ఇవాళ్టి నుంచే! ఉగాది... కొత్త సంవత్సరానికి శుభారంభం. ఈ పండుగతో పాటు ఇవాళ్టి నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు మరో పండుగ కూడా మొదలైంది. ‘సర్దార్...’ సందడి నిజానికి, రెండు వారాల క్రితం నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ ‘ఊపిరి’తోనే ఈ సమ్మర్ సినీ సీజన్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. పవన్‌కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజ్‌తో, సమ్మర్ సీజన్ సినిమా రిలీజ్‌ల పండుగ నిజమైన భారీ స్థాయికి చేరింది. ఇక ఇప్పటి నుంచి రెండేసి వారాల గ్యాప్‌లో ఒక్కో పెద్ద హీరో సినిమా వస్తోంది. తెలుగు, హిందీల్లో కలిపి, దేశం మొత్తం మీద రికార్డు సంఖ్యలో 2 వేలకు పైగా హాళ్లలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజవుతోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల్లో జనం ముందుకు వెళుతోంది. ఇందులో 23 దేశాల్లో మొదటిసారిగా ఒక తెలుగు సినిమా రిలీజవు తోంది. అందుకే, ‘సర్దార్...’ పర్ఫెక్ట్ సినిమా పండగ హంగామానే. రెండేసి వారాల గ్యాప్‌లో... పెద్ద హీరో, పెద్దయెత్తున రిలీజ్లు కాబట్టి సహజంగానే ఎవరూ పోటీకి దిగరు. భారీ మొత్తాల్ని పణంగా ఒడ్డడం వల్ల, ఆ సొమ్మును వెనక్కి రాబట్టడానికి పెద్ద సినిమాల మధ్య ఒకటికి రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుం టున్నారు. అందుకే, పవన్ కల్యాణ్ వచ్చిన రెండు వారాల తర్వాతే ఏప్రిల్ 22న బోయపాటి దర్శక త్వంలో అల్లు అర్జున్ ‘సరైనోడు’గా రానున్నారు. ఇక, తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘తెరి’ అక్కడ తమిళ ఉగాదికి ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ‘దిల్’ రాజు తెలుగులో ‘పోలీసోడు’గా అందిస్తున్న ఈ సినిమాను మాత్రం ఏకకాలంలో రిలీజ్ కోసం ఇక్కడా ఏప్రిల్ 14నే విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నారు. మే నెలలో... ఒకటికి మూడు తెలుగుతో పాటు మలయాళంలోనూ మాస్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ సినిమా తర్వాత రెండు వారాల గ్యాప్ చూసుకొని, మే 6న నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘అ...ఆ...’. ఇప్పటికే 2 పాటలు మినహా షూటిం గంతా పూర్తయిన ఈ సినిమా ఆ డేట్‌కి రిలీజవడా నికి చురుగ్గా సన్నాహాలు చేసుకుంటోంది. మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ కూడా ఇంకా షూటింగ్ హంగామాలో ఉంది. ఏప్రిల్ ఆఖరు కల్లా రిలీజని మొదట అనుకున్న ఈ సినిమా ఇప్పుడు మే నెల రెండు, మూడు వారాలకు వచ్చే సూచనలున్నట్లు కృష్ణానగర్ వర్గాల కబురు. వీటి మధ్య సందు చూసుకొని, మే నెలలోనే సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ రిలీజ్‌కు నిర్మాత ‘దిల్’ రాజు సిద్ధమవుతున్నారు. అంటే, నడి వేసవిలో ఒకటికి మూడు రిలీజులు రానున్నాయి. తెలుగునాట... తమిళ స్టార్స మాట... ఈ వేసవిలో ఇద్దరు తమిళ సూపర్స్టార్ల చిత్రాలూ రిలీజవుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ చిత్రం ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. మరోపక్క సూర్య హీరోగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’ కూడా తుదిమెరుగుల్లో ఉంది. అయితే, తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, హంగామా నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రాల రిలీజ్ డేట్లు ఇంకా పక్కాగా నిర్ధారణ కాలేదు. జూన్‌లో కానీ ఇవి రిలీజ్ కావని ఒక టాక్. ఈ పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాల రిలీజ్లు అనేకం. అన్ని పండగలూ ఒకేసారి! సరిగ్గా ఇవాళ్టి నుంచే ఐ.పి.ఎల్. క్రికెట్ సీజన్ కూడా మొదలవుతోంది. అంటే అన్ని పండగలూ ఒకేసారి వచ్చేశాయన్న మాట. వెరసి, రాగల కొద్ది వారాల పాటు పిల్లలకు సెలవులు, కొత్త రిలీజ్‌ల కోలాహలం, నరాలు తెగే ఉత్కంఠ నిండిన క్రికెట్ మ్యాచ్‌ల సందడి - ఒకటే హంగామా. అందుకే, గురూ... ఇవాళ్టి నుంచే పండగ షురూ. ఈ వినోదాల విందుకు ఆర్ యూ రెడీ.