‘ఎలక్షన్స్ ఉన్నా కలక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి’ | Sumanth Subramanyapuram Press Meet | Sakshi
Sakshi News home page

Dec 8 2018 2:39 PM | Updated on Dec 8 2018 2:44 PM

Sumanth Subramanyapuram Press Meet - Sakshi

సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకం పై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’.  సెన్సిబుల్ హీరో సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈమూవీ తో  సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శుక్రవారం  రిలీజ్ అయిన ఈ మూవీ  సక్సెస్ టాక్‌ని సొంత చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జగర్లపూడి, నిర్మాత బీరం సుధాకర రెడ్డి పాల్గొన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ... ‘నిన్న ఎలక్షన్స్ ఉన్నా సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి చాలా మంచి రిపోర్ట్స్ విన్నాను. మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాను చాలా మంచి టాక్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సంతోష్ లాగా ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే ఏ జానర్ లో అయినా సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాను’ అన్నారు. (మూవీ రివ్యూ : ‘సుబ్రహ్మణ్యపురం’)

దర్శకుడు సంతోష్ జగర్లపూడి మాట్లాడుతూ... ‘ముఖ్యంగా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత బీరం సుధాకర రెడ్డి గారికి, సుమంత్ గారికి థాంక్స్. నిన్న యూఎస్ నుండి  నా ఫ్రెండ్స్ కాల్ చేసి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు.  సెకండ్ ఆఫ్ గురించి కథనంపై  చాలా మంచి  ప్రశంసలు వస్తున్నాయి. మీడియా చాలా బాగా సపోర్ట్ చేసింది. చాలా థాంక్స్’ అన్నారు.

నిర్మాత బీరం సుధాకర రెడ్డి మాట్లాడుతూ.. ‘మార్నింగ్ షోస్ నుండే హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధించింది సుబ్రహ్మణ్యపురం.
ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి సహకరించిన హీరో సుమంత్ గారికి, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement