లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ | Sumanth Ashwin in Vamsi Ladies Tailor | Sakshi
Sakshi News home page

లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్

Oct 6 2016 10:29 PM | Updated on Sep 4 2017 4:25 PM

లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్

లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్

వాలు జడ, రూపాయి కాసంత బొట్టు, కళ్లకు కాటుక, కాళ్లకు పట్టీలు, ఒంటి నిండా చీర... దర్శకుడు వంశీ చిత్రాల్లో

 వాలు జడ, రూపాయి కాసంత బొట్టు, కళ్లకు కాటుక, కాళ్లకు పట్టీలు, ఒంటి నిండా చీర... దర్శకుడు వంశీ చిత్రాల్లో హీరోయిన్ ఇలా నిండుగా, చూడ్డానికి రెండు కళ్లూ చాలనంత అందంగా ఉంటుంది. ఆయన సినిమా మన ఇంట్లోనో.. మన పక్కింట్లోనో జరుగుతున్న కథలా ఉంటుంది. అంత సహజంగా ఉంటుంది కాబట్టే, వంశీ సినిమాకి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న వాటిలో ‘లేడీస్ టైలర్’ ఒకటి.
 
 ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ తెరకెక్కించనున్నారు. ఇందులో టైటిల్ రోల్ చేసే అవకాశం సుమంత్ అశ్విన్‌కి దక్కింది. వంశీ వంటి డెరైక్టర్‌తో సినిమా అంటే సుమంత్ అశ్విన్‌కి గోల్డెన్ చాన్స్ లాంటిదే. మధుర ఎంటర్‌టైన్ మెంట్స్‌పై ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించను న్నారు. ముగ్గురు కథా నాయికలు ఉంటారట. నవంబర్‌లో చిత్రాన్ని ఆరంభిం చాలనుకుంటు న్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement