బాహుబలిని దాటేసిన సుల్తాన్ | Sultan beats Baahubali | Sakshi
Sakshi News home page

బాహుబలిని దాటేసిన సుల్తాన్

Jul 15 2016 8:57 AM | Updated on Sep 4 2017 4:56 AM

బాహుబలిని దాటేసిన సుల్తాన్

బాహుబలిని దాటేసిన సుల్తాన్

ఒకప్పుడు సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడిందన్న అన్నలెక్కలతో చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా సక్సెస్ ను ఎన్ని రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో...

ఒకప్పుడు సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడిందన్న అన్నలెక్కలతో చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా సక్సెస్ ను ఎన్ని రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో చెపుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ఈ లెక్కలు కీలకంగా మారాయి. ముఖ్యంగా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల నుంచి అభిమానులు అదే స్థాయి కలెక్షన్లు ఆశిస్తున్నారు.

అభిమానుల ఆశలకు తగ్గట్టు బాలీవుడ్ కండల వీరుడు వరసగా రికార్డ్ లు బ్రేక్ చేస్తున్నాడు. తన ఫ్లాప్ సినిమాలతో కూడా వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ వస్తున్న సల్మాన్. హిట్ సినిమా అయితే సరికొత్త రికార్డ్ లను సెట్ చేస్తూ టాప్ స్టార్ కు టార్గెట్ సెట్ చేస్తున్నాడు. తాజాగా ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ ను సుల్తాన్ సినిమాతో సల్మాన్ బద్దలు కొట్టాడు.

ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా తొలి వారంలో 185 కోట్ల వసూళ్లను సాధించింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ తొలివారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సరికొత్త రికార్డ్ ను సృష్టించాడు. ఇన్నాళ్లు తొలి వారం కలెక్షన్ల విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాహుబలి సుల్తాన్ దెబ్బకి రెండో స్ధానానికి పడిపోయింది. ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తున్న సుల్తాన్ ముందు మరిన్ని రికార్డులు సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement