ఎన్టీఆర్‌కి సుకుమార్ వెరైటీ గిఫ్ట్ | Sukumar presents Nannaku Prematho Clock to NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కి సుకుమార్ వెరైటీ గిఫ్ట్

May 21 2016 8:52 AM | Updated on Sep 4 2017 12:37 AM

ఎన్టీఆర్‌కి సుకుమార్ వెరైటీ గిఫ్ట్

ఎన్టీఆర్‌కి సుకుమార్ వెరైటీ గిఫ్ట్

శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్టైల్లో విషెస్ తెలియజేశారు. తమ జనరేషన్ హీరో అయినా ఈగోలు పక్కన పెట్టి రామ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్, జూనియర్కు...

శుక్రవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్టైల్లో విషెస్ తెలియజేశారు. తమ జనరేషన్ హీరో అయినా ఈగోలు పక్కన పెట్టి రామ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్, జూనియర్కు ఇది సక్సెస్ ఫుల్ ఏడాది కావాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ను తొలిసారిగా 50 కోట్ల క్లబ్లో నిలబెట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన క్రియేటివిటీతో ఓ స్పెషల్ గిఫ్ట్ను తయారు చేయించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా థీమ్తో రూపొందించిన ఈ గిఫ్ట్తో ఎన్టీఆర్ను సర్ప్రైజ్ చేశాడు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ వాచ్ను తయారు చేయించాడు. 'టు డాడ్ విత్ లవ్' అని రాసున్న ఈ వాచ్లో నాన్నకు ప్రేమతో సినిమాలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ను తెలిపేలా ఏడు బటర్ఫ్లై లతో డిజైన్ చేయించాడు. వీటితో పాటు ఫాలో ఫాలో సాంగ్ లిరిక్స్, గేమ్ ఓవర్ అని పదాలను యాడ్ చేశాడు. ఇక సినిమాలో జగపతిబాబు ఆడే బాల్ గేమ్కి సంబంధించిన బాల్స్ కూడా ఈ వాచ్ డిజైనింగ్లో ఉపయోగించాడు. సుక్కూ ఇచ్చిన సర్ప్రైజ్పై స్పందించిన ఎన్టీఆర్, ఇది ఇప్పటివరకు అందుకున్న వాటిలో అరుదైన గిఫ్ట్ అంటూ ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement