సూపర్‌ స్టార్‌తో సుక్కూ..? | Sukumar Next Movie With Super Star Mahesh Babu | Sakshi
Sakshi News home page

Apr 15 2018 10:42 AM | Updated on Apr 15 2018 12:44 PM

Sukumar Next Movie With Super Star Mahesh Babu - Sakshi

వన్‌ నేనొక్కడినే షూటింగ్ సమయంలో మహేష్‌ బాబు, సుకుమార్‌

రంగస్థలం సక్సెస్‌తో దర్శకుడు సుకుమార్‌ రేంజ్‌ మారిపోయింది. ఇన్నాళ్లు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరున్నా.. సుకుమార్‌కు భారీ కమర్షియల్‌ సక్సెస్‌లు మాత్రం దక్కలేదు. రంగస్థలంతో ఆ లోటు కూడా తీరిపోయింది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం 150 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఇంతటి ఘనవిజయం సాధించిన సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చ మొదలైంది.

సినిమా సినిమాకు మధ్య సుకుమార్ చాలా గ్యాప్‌ తీసుకుంటాడు. అంటే మరో సినిమాపై క్లారిటీ రావటానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే తాజా సమచారం ప్రకారం సుకుమార్ తన నెక్ట్స్ సినిమాను సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం భరత్‌ అనే నేను రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న మహేష్, తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు సూపర్‌ స్టార్‌ ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement