సుకుమార్తో శర్వా | sukumar movie with sharwanand | Sakshi
Sakshi News home page

సుకుమార్తో శర్వా

Apr 19 2016 10:56 AM | Updated on Sep 3 2017 10:16 PM

సుకుమార్తో శర్వా

సుకుమార్తో శర్వా

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకే చెప్పాడు.

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్న ఈ యంగ్ హీరో, త్వరలో ఓ క్రియేటివ్ డైరెక్టర్తో కలిసి పనిచేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోలతో డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించిన సుకుమార్తో సినిమా చేయనున్నాడు యంగ్ హీరో శర్వానంద్.
 
అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు కాదు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పిన సుక్కూ, ఆ బ్యానర్పై కుమార్ 21ఎఫ్ సినిమాను తెరకెక్కించి ఘనవిజయం సాధించాడు. ఇప్పడు అదే బ్యానర్లో శర్వానంద్ హీరోగా సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. మరోసారి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలోనే ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడట సుకుమార్. అంతేకాదు కుమార్ 21ఎఫ్ తరహాలోనే కథ స్క్రీన్ ప్లే మాటలు సుకుమారే అందించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement