మహేశ్‌ సినిమా కోసం గ్రౌండ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా

Sudheer babu interview about Nannu Dochukunduvate - Sakshi

‘‘కెరీర్‌ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం తిరిగినప్పుడు చాలాసార్లు నిరాశే ఎదురైంది. అప్పుడు అనుకున్నాను సినిమా ప్రొడ్యూస్‌ చేసే అవకాశం వస్తే కొత్తవాళ్లకు చాన్స్‌ ఇవ్వాలని. నటుడిగా కొన్నేళ్ల తర్వాత ఫేడ్‌ అయినా బ్యానర్‌ మాత్రం సురేశ్‌ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లాగా తరతరాలుగా ఉండిపోతుందనిపించింది. అందుకే స్టార్ట్‌ చేశాను’’ అన్నారు సుధీర్‌బాబు. ఆర్‌.ఎస్‌. నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ నేడు రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు.

► యాక్టర్‌గా సీన్‌లో లీనమవ్వాలంటే మైండ్‌ క్లియర్‌గా ఉండాలి. నిర్మాత కూడా నేనే కావడంతో సెట్లో ఏదైనా వేస్ట్‌ అయిందనిపిస్తే అప్‌సెట్‌ అవ్వడం సహజం. మొత్తానికి హీరోగా, నిర్మాతగా బాలెన్డ్స్‌గానే వ్యవహరించా.

► నిర్మాత అవుతున్నానని మహేశ్‌కి చెప్పగానే ‘సరే’ అన్నా కంగారుపడి ఉంటాడనుకుంటున్నా. హీరో అవుతానన్నప్పుడు కూడా ‘సరే’ అన్నాడు. అయితే నాకు మొహమాటం. ఈ ఇండస్ట్రీలో నా విధానం నప్పుతుందో లేదోనని కంగారుపడ్డాడు. మహేశ్‌కి సరిపోయే కథ దొరికితే నిర్మిస్తాను. తనతో సినిమా నిర్మించడం కోసం ఇది గ్రౌండ్‌ ప్రాక్టీస్‌ అనుకుంటున్నా.

► సెప్టెంబర్‌ 13న మా సినిమా రిలీజ్‌ అని ఫస్ట్‌ మేమే అనౌన్స్‌ చేశాం. కానీ భార్యా భర్తలు పబ్లిక్‌లో తక్కువసార్లు పోటీ పడతారు. (నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్‌’ ఒకే రోజు రిలీజ్‌ గురించి). అందుకే వాళ్ల మధ్యలో వెళ్లి వేళ్లు కాల్చుకోవడం ఎందుకని రిలీజ్‌ని వారం వాయిదా వేసుకున్నాం (నవ్వుతూ).

► వీడు ఇది చేయలేడేమో అన్న ప్రతిసారీ దాన్ని బ్రేక్‌ చేస్తున్నాను. ‘యస్‌యమ్‌ఎస్‌’లో నా వాయిస్‌ బాగా లేదన్నారు. దాని మీద వర్క్‌ చేశాను. యాక్షన్‌ సినిమాలే చేస్తాడేమో అన్నారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ లాంటి లవ్‌స్టోరీ చేశాను. అలాగే సెటిల్డ్‌ రోల్స్‌ చేయాలని ‘సమ్మోహనం’, ఈ సినిమా చేశా. ప్రస్తుతానికి మల్టీస్టారర్‌ మూవీస్‌ వద్దనుకుంటున్నా.

► మనంతట మనం నిలబడాలనుకునే మనస్తత్వం గలవాణ్ని. పద్మాలయ బేనర్‌ ఉన్నప్పటికీ మహేశ్, ఇందిరా ప్రొడక్షన్స్‌ బేనర్లు స్టార్ట్‌ అయ్యాయి. నా బేనర్‌ కూడా అంతే. కథ బావుండి, నేను కాకుండా ఫలానా హీరోలు చేస్తే బావుండు అనిపిస్తే వేరే హీరోలతో కూడా నిర్మిస్తాను. అలాగే ఓన్‌ బ్యానర్‌ స్టార్ట్‌ చేసినా బయట ప్రొడక్షన్‌లో కూడా సినిమాలు చేస్తా. నెక్ట్స్‌ ‘వీరభోగ వసంత రాయ లు’, పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ చేస్తున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top