సుధీర్‌, ఇంద్రగంటిల ‘సమ్మోహనం’

sudheer babu indraganti movie title sammohanam - Sakshi

సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబు, సక్సెస్‌ జోరు మీదున్న ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌  పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ త్వరలో మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనున్నారు. సోలో హీరోగా మల్టీ స్టారర్ సినిమాలతో టాలీవుడ్ బిజీగా ఉన్న సుధీర్ బాబు.. బాలీవుడ్‌లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.  హిందీలో ‘బాగీ’(తెలుగులో వర్షం సినిమా) సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు.

జెంటిల్ మన్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత గ్యాప్ తీసుకున్న ఇంద్రగంటి తరువాత సుధీర్ తో సినిమాను ప్రారంభించారు. మరోసారి ఒక అందమైన ప్రేమకథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘సమ్మోహనం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్‌ పక్కింట అబ్బాయిలా,  సరదాగా ఉండే  పాత్రలో నటిస్తున్నారు. మణిరత్నం, కార్తీ కాంబినేషన్ లో రూపొందిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అదితిరావ్ హైదరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top