ఎనర్జిటిక్‌ స్టార్‌ కోసం బాలీవుడ్ విలన్‌

Sudhanshu Pandey In Ram Ismart Shankar - Sakshi

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యే ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాను ప్రారంభించారు. డబుల్ దిమాక్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్‌ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో రామ్‌ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా ప్రతినాయక పాత్రలకు బాలీవుడ్ నటుడిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో స్టైలిష్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్న సుదాన్షు పాండే ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.ఓ లో సుధాన్షు గెస్ట్‌ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top