'ఎక్స్ప్రెస్ రాజా' కథ ఇదేనా..? | Story of Express raja Leaked..? | Sakshi
Sakshi News home page

'ఎక్స్ప్రెస్ రాజా' కథ ఇదేనా..?

Jan 12 2016 5:40 PM | Updated on Sep 3 2017 3:33 PM

'ఎక్స్ప్రెస్ రాజా' కథ ఇదేనా..?

'ఎక్స్ప్రెస్ రాజా' కథ ఇదేనా..?

భారీ సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా తమ సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారు చిన్న సినిమా నిర్మాతలు. అలాంటిది మూడు భారీ చిత్రాలు బరిలో ఉన్నా.. అదే సమయంలో రిలీజ్కు రెడీ అవుతోంది ఎక్స్‌ప్రెస్ రాజా.

భారీ సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా తమ సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారు చిన్న సినిమా నిర్మాతలు. అలాంటిది మూడు భారీ చిత్రాలు బరిలో ఉన్నా.. అదే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్నాడు 'ఎక్స్ప్రెస్ రాజా'. శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలవుతోంది. అంత ధైర్యంగా సినిమా రిలీజ్ చేయడానికి ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో ఏముందన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అందుకు తగ్గట్టుగానే ఇదే ఎక్స్ప్రెస్ రాజా కథ అంటూ ఓ లైన్ ప్రచారంలోకి వచ్చింది.

ఎక్స్ప్రెస్ రాజా కథ అంతా ఓ కుక్క చుట్టూ తిరుగుతుంది. కుక్కలంటే అస్సలు గిట్టని హీరో రాజా, తన కుక్కను ప్రాణంగా చూసుకునే సురభితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో ఆ కుక్క తప్పిపోతుంది. దానిని వెతికే ప్రయత్నంలో ఎన్నో పాత్రలు వస్తాయి. ఇంతమంది ఆ కుక్క కోసం ఎందుకు వెతుకుతున్నారో అర్థం కాక హీరో తికమకపడుతుంటాడు. అయితే చివరగా ఆ కుక్క మెడలో ఓ డైమండ్ ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఫైనల్గా ఆ కుక్కను పట్టుకొని హీరోయిన్ ప్రేమను గెలుచుకుంటాడు.

ఇదే ఎక్స్ప్రెస్ రాజా కథ అన్న విషయం అఫీషియల్గా తెలియకపోయినా.. ఈ కథ అయితే బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో కేవలం ఒక జర్నీనే కథగా మలిచి ఎంటర్టైన్ చేసిన మేర్లపాక గాంధీ వినోదం పంచటానికి ఎంతో స్కోప్ ఉన్న ఈ తరహా కథతో అయితే మ్యాజిక్ చేయటం గ్యారెంటీ అంటున్నారు సినీ అభిమానులు. మరి ఎక్స్ప్రెస్ రాజా కథ ఇదేనా..? కాదా..? తెలియాలంటే ఫస్ట్ షో పడే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement