సింగంతో ఓ సెల్ఫీ | sruthihasan Selphi with surya | Sakshi
Sakshi News home page

సింగంతో ఓ సెల్ఫీ

Oct 25 2016 10:57 PM | Updated on Sep 4 2017 6:17 PM

సింగంతో ఓ సెల్ఫీ

సింగంతో ఓ సెల్ఫీ

వన్.. టు.. త్రీ.. మొన్నటివరకూ శ్రుతీహాసన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు.

వన్.. టు.. త్రీ.. మొన్నటివరకూ శ్రుతీహాసన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. అదే ‘సింగం-3’. సూపర్ హిట్ ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందు తోన్న మూడో చిత్రమిది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాలతో సూర్యకు సూపర్ సక్సెస్ అందించిన దర్శకుడు హరి, ఈ మూడో చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. జార్జియా లో సూర్య, శ్రుతీలపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. ‘‘సింగం 3’ షూటింగ్ పూర్తి చేశా, తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తున్నా’’ అని శ్రుతీహాసన్ ట్వీట్ చేశారు. ఈ సినిమా గుర్తుగా సూర్యతో ఓ సెల్ఫీ తీసుకున్నారు.

అనుష్క మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement