ఒక పెద్ద హీరో.. నలుగురు కుర్ర హీరోలతో.. | SRK aside, Alia Bhatt next movie will have four more guys | Sakshi
Sakshi News home page

ఒక పెద్ద హీరో.. నలుగురు కుర్ర హీరోలతో..

Apr 4 2016 5:30 PM | Updated on Sep 3 2017 9:12 PM

ఒక పెద్ద హీరో.. నలుగురు కుర్ర హీరోలతో..

ఒక పెద్ద హీరో.. నలుగురు కుర్ర హీరోలతో..

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు హీరోలతో ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఆడిపాడనుంది. తన తదుపరి ఒకే చిత్రంలో ఐదుగురు నటులతో కలిసి నటించనుంది.

ముంబయి: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు హీరోలతో ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఆడిపాడనుంది. తన తదుపరి ఒకే చిత్రంలో ఐదుగురు నటులతో కలిసి నటించనుంది. వీరిలో ఒకరు అగ్రహీరో, సూపర్ స్టార్ షారుక్ ఖాన్కాగా మిగితా నలుగురు యంగ్ హీరోలు.

ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ కొట్టిన గౌరీ షిండే ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్గా నటించనుండగా ఆష్కి-2 ఫేమ్ ఆదిత్యరాయ్ కపూర్, అలి జాఫర్, అంగాడ్ బేడి, కునాల్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ కూడా నటించనున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటనే విషయం మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement