ఫ్లాప్ డైరెక్టర్‌తో వరుణ్..? | Srinu vaitla next movie with varun tej | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ డైరెక్టర్‌తో వరుణ్..?

Dec 16 2015 9:35 AM | Updated on Mar 22 2019 1:53 PM

ఫ్లాప్ డైరెక్టర్‌తో వరుణ్..? - Sakshi

ఫ్లాప్ డైరెక్టర్‌తో వరుణ్..?

తొలి సినిమా నుంచే కథల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్న వరుణ్ తేజ్, మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా...

తొలి సినిమా నుంచే కథల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్న వరుణ్ తేజ్, మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయినా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన రెండో సినిమా కంచెతో అందరి దృష్టిని ఆకర్షించాడు వరుణ్. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

వరుణ్ హీరోగా లోఫర్ సినిమాను నిర్మించిన సి కళ్యాణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. వీటిలో ఒక సినిమాలో వరుణ్ హీరోగా నటించే అవకాశం ఉందంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వరుణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ ఫుల్లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement