చదరంగం  | Srikanth In Chadarangam Web Series | Sakshi
Sakshi News home page

చదరంగం 

Jul 17 2019 8:43 AM | Updated on Jul 17 2019 8:43 AM

Srikanth In Chadarangam Web Series - Sakshi

బిగ్‌ స్క్రీన్‌పై చూసే సినిమాలకే కాదు.. వెబ్‌ సిరీస్‌లకూ ప్రస్తుతం మంచి ఆదరణ ఉంటోంది. అందుకే స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్‌ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బడా నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా హీరో మంచు విష్ణు కూడా ‘చదరంగం’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సిరీస్‌కి నటుడు మంచు మోహన్‌బాబు క్లాప్‌ ఇచ్చారు. ‘‘కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందనుంది.. ఇది కొంత మందికి షాక్‌ ఇస్తుంది’’ అని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement