పోలీస్ పవర్! | Srikanth Action thriller movie 'Tie' | Sakshi
Sakshi News home page

పోలీస్ పవర్!

Apr 25 2015 10:51 PM | Updated on Apr 3 2019 8:51 PM

పోలీస్ పవర్! - Sakshi

పోలీస్ పవర్!

దాదాపు 140 నిమిషాల పాటు సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘టై’. శ్రీకాంత్ హీరోగా అఖండ

దాదాపు 140 నిమిషాల పాటు సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘టై’. శ్రీకాంత్ హీరోగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ మస్తాన్ నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ కాసెట్టి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ‘‘ఇంతకు ముందు కూడా పోలీస్ పాత్రల్లో నటించాను. కానీ ఈ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటునిగా నాకు తృప్తినిచ్చిన సినిమా ఇది’’ అని హీరో శ్రీకాంత్ చెప్పారు.  ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, కెమెరా: శ్యాం ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి.
 

Advertisement
 
Advertisement
Advertisement