మీసం తిప్పాడు | Sri Vishnu Thippara Meesam First Look release | Sakshi
Sakshi News home page

మీసం తిప్పాడు

Feb 7 2019 5:12 AM | Updated on Feb 7 2019 5:12 AM

Sri Vishnu Thippara Meesam First Look release - Sakshi

శ్రీ విష్ణు

శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘తిప్పరా మీసం’. నిక్కి తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటించారు. ‘అసుర’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్‌. ఎల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  రిజ్వాన్‌ ఎంటరై్టన్మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్‌పై రిజ్వాన్‌ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ బుధవారం విడుదలైంది. ‘‘తిప్పరా మీసం’ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉంది. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు దర్శక, నిర్మాతలు. అచ్యుత్‌ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్‌ నేని, ప్రవీణ్, నేహా దేశ్‌ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కెమెరా: సి«ద్, సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత రామారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మనోజ్‌ మావిళ్ల.

Advertisement
 
Advertisement
Advertisement