కాపీ కొట్టలేదు! | sreenivas reddy said i dont copy from jandyala movies mark comedy | Sakshi
Sakshi News home page

కాపీ కొట్టలేదు!

Nov 15 2016 10:51 PM | Updated on Sep 4 2017 8:10 PM

కాపీ కొట్టలేదు!

కాపీ కొట్టలేదు!

‘‘భాగ్యరాజా, జంధ్యాల, వంశీ స్టయిల్ కామెడీ మా ‘జయమ్ము... నిశ్చయమ్మురా’లో ఉంటుంది. ఇందులోని వినోదం కాపీ కొట్టింది కాదు.

‘‘భాగ్యరాజా, జంధ్యాల, వంశీ స్టయిల్ కామెడీ మా ‘జయమ్ము... నిశ్చయమ్మురా’లో ఉంటుంది. ఇందులోని వినోదం కాపీ కొట్టింది కాదు. మన మూలాలు తెలియజేయడం కోసమే దేశవాళీ వినోదం అంటున్నాం’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. ఆయన హీరోగా, పూర్ణ హీరోయిన్‌గా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘జయమ్ము... నిశ్చయమ్మురా’ ఈ నెల 25న విడుదలవుతోంది. నేడు పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ ‘గీతాంజలి’ చిత్రంలో నేను హీరో అనుకోవడం లేదు. ఓ క్యారెక్టర్ చేశానని భావిస్తున్నా. కానీ, ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ కథ నాతోనే నడుస్తుంది. శివరాజ్ ఈ చిత్రంతో పెద్ద డెరైక్టరవు తాడు. తొలుత ‘సర్వమంగళం’ టైటిల్ అనుకున్నాం. నెగటివ్‌గా ఉంటుందని మార్చాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement