డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ‘బ్రోచేవారెవరురా’ | Sree Vishnu Brochevarevarura Movie Teaser | Sakshi
Sakshi News home page

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ‘బ్రోచేవారెవరురా’

Apr 20 2019 12:28 PM | Updated on Apr 20 2019 12:28 PM

Sree Vishnu Brochevarevarura Movie Teaser - Sakshi

వైవిధ్యమైన క‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా త‌నకంటూ ప్రత్యేక‌త‌ గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మ‌న్యం ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, నివేదా థామస్‌ లతో పాటు సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌లను టీజర్‌లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శక‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ‘చ‌ల‌న‌మే చిత్రము.. చిత్రమే చ‌ల‌న‌ము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌.

యువ సంగీత ద‌ర్శకుడు వివేక్ సాగ‌ర్ సంగీత సార‌థ్యం అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement