చలనమే చిత్రము | Sree Vishnu Brochevarevarura First Look Release | Sakshi
Sakshi News home page

చలనమే చిత్రము

Mar 22 2019 2:46 AM | Updated on Mar 22 2019 2:46 AM

Sree Vishnu Brochevarevarura First Look Release - Sakshi

శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము..’ అనేది ట్యాగ్‌ లైన్‌. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. రంగురంగుల దుస్తుల్లో ఉన్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలు ఒకే స్కూటర్‌పై వెళుతుండటం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణుకి జోడీగా నివేదా థామస్‌ నటించారు. సత్యదేవ్, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, కెమేరా: సాయి శ్రీరాం.

Advertisement
 
Advertisement
Advertisement