స్ట్రీట్‌ ఫైటర్‌ | Srar Movie Press Meet | Sakshi
Sakshi News home page

స్ట్రీట్‌ ఫైటర్‌

May 18 2019 2:23 AM | Updated on May 18 2019 2:23 AM

Srar Movie Press Meet - Sakshi

హీన అచ్చర, నవీన్‌ సంజయ్‌

‘శరణం గచ్ఛామి’ ఫేమ్‌ నవీన్‌ సంజయ్, హీన అచ్చర జంటగా ఓ సినిమా రూపొందుతోంది. మాల్యాద్రి మామిడి (ప్రదీప్‌) దర్శకత్వం వహిస్తున్నారు. సహస్ర మూవీ మేకర్స్‌ పతాకంపై శ్రీహరి పల్లపు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘స్టార్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.  నవీన్‌ సంజయ్‌ మాట్లాడుతూ–‘ఇందులో నేనొక స్ట్రీట్‌ ఫైటర్‌గా చేస్తున్నాను. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన శ్రీహరి, మాల్యాద్రిగార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు. మాల్యాద్రి మామిడి మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్‌ ఎంటరై్టనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.

హీరో హీరోయిన్‌లపై కొన్ని మెయిన్‌ టాకీ పార్ట్‌ హైదరాబాద్‌లో చిత్రీకరించాం. దీంతో షూటింగ్‌ 30శాతం పూర్తి అయింది. ఈ నెలాఖరులో ప్రారంభించే సెకండ్‌ షెడ్యూల్‌తో 70శాతం చిత్రీకరణ పూర్తి అవుతుంది’’ అన్నారు.  ‘‘మాల్యాద్రి చెప్పిన కథ నచ్చిన  వెంటనే సినిమాని సెట్స్‌ పైకి తీసువెళ్లి, మొదటి షెడ్యూల్‌ పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వస్తోంది’’ అన్నారు శ్రీహరి పల్లపు. హీన అచ్చర, నటి అపూర్వ శర్మ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.యమ్‌. స్వామి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రవి కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement