తల్లికాబోతున్న హీరోయిన్? | speculating news: actress was expecting a baby? | Sakshi
Sakshi News home page

తల్లికాబోతున్న హీరోయిన్?

Aug 10 2015 1:18 PM | Updated on Apr 3 2019 6:23 PM

తల్లికాబోతున్న హీరోయిన్? - Sakshi

తల్లికాబోతున్న హీరోయిన్?

ప్రముఖబాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తల్లి కాబోతోందా? ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యానాల్నిబట్టి చూస్తే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు

న్యూఢిల్లీ: ప్రముఖబాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తల్లి కాబోతోందా? ఇటీవల ఆమె చేసిన  కొన్ని వ్యాఖ్యానాల్నిబట్టి చూస్తే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.  ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ భామ  ప్రసవానికి ముందు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మసాజ్కు సంబంధించి కొన్ని కమెంట్లు  చేసింది.  దీంతో ఆమె తల్లికాబోతోందనే వార్తలు ఇపుడు బాలీవుడ్లో  షికార్లు  చేస్తున్నాయి. 
 
రాణీ ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత రాణి బాలీవుడ్కు, మీడియాకు దూరంగా  ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో రాణి తల్లిగా ప్రమోషన్ కొట్టేసిందన్న వార్తలపై వారిద్దరినుంచి ఎలాంటి  దృవీకరణ  ఇంకా లభించలేదు.  ఆదిత్య, రాణి దంపతులు తమ ప్రేమ, పెళ్లి విషయంలో వచ్చిన వార్తలను మొదట్లో రూమర్లు అంటూ చాలాకాలం కొట్టేశారు. ఇపుడు ఎలా స్పందిస్తారో చూడాలి. రాణి నటించిన చివరి చిత్ర్దం మర్దానీ.   వివాహం తర్వాత  రాణీ ముఖర్జీ   మరే చిత్రంలోనూ  నటించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement