అప్పుడు మాకు నిద్రపట్టలేదు...! | SPECIAL MOVIE PRESSMEET | Sakshi
Sakshi News home page

అప్పుడు మాకు నిద్రపట్టలేదు...!

Oct 16 2017 3:35 AM | Updated on Oct 16 2017 3:54 AM

SPECIAL MOVIE PRESSMEET

అజయ్, రంగ, అక్షిత, సంతోష ముఖ్యతారాగణంగా నందనాల్‌ క్రియేషన్స్‌ పతాకంపై వాస్తవ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘స్పెషల్‌’. ద స్టోరీ ఆఫ్‌ ఏ మైండ్‌ రీడర్‌ అనేది ఉపశీర్షిక. ఎన్‌వీయస్‌ మణ్యం స్వరకర్త. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఆల్మోస్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. మా చిత్రానికి అజయ్‌గారు బ్యాక్‌బోన్‌ లాంటి వారు. ఇన్వెస్టిగెటివ్‌ ఆఫీసర్‌గా ఆయన మేము ఊహించిన దాని కన్నా సూపర్‌గా నటించారు.

సైకాలజీ డాక్టర్‌ అశోక్‌కుమార్, అక్షిత, సంతోష, రంగా బాగా నటించారు. మా సినిమా కాస్త షూటింగ్‌ జరిగిన తర్వాత  ‘రాజుగారి గది 2’ లో నాగార్జున మైండ్‌ రీడర్‌గా చేస్తున్నారని తెలిసింది. అప్పుడు మాకు నిద్రపట్టలేదు. కానీ, సినిమా చూశాక నాగార్జునగారి క్యారెక్టర్‌ చూసి, హ్యాపీ ఫీలయ్యాం. ఆయన నటన ఎక్స్‌లెంట్‌. మా మైండ్‌ రీడర్‌కి, ‘రాజుగారి గది–2’ మైండ్‌ రీడర్‌కి పోలిక లేదు’’ అన్నారు.  ‘‘కథ వినగానే ఇలాంటి కాన్సెప్ట్‌ చిత్రాలు ప్రేక్షకులు నచ్చుతాయా అని ఆలోచించాను. కానీ, అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. మంచి క్యారెక్టర్‌ చేస్తున్నాను’’ అన్నారు అజయ్‌. ‘ఈ చిత్రంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ క్యారెక్టర్‌ చేశాను’’ అన్నారు రంగా.  అశోక్‌కుమార్, ఎస్‌వీయస్‌ మణ్యం, అక్షిత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement