'పొగడ్తలు సరే.. మా అమ్మాయి ఇంకా నేర్చుకోవాలి' | Sonam still needs to improve a lot: Anil Kapoor | Sakshi
Sakshi News home page

'పొగడ్తలు సరే.. మా అమ్మాయి ఇంకా నేర్చుకోవాలి'

Feb 22 2016 8:14 AM | Updated on Apr 3 2019 6:23 PM

'పొగడ్తలు సరే.. మా అమ్మాయి ఇంకా నేర్చుకోవాలి' - Sakshi

'పొగడ్తలు సరే.. మా అమ్మాయి ఇంకా నేర్చుకోవాలి'

తన కూతురు, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అన్నారు.

ముంబయి: తన కూతురు, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అన్నారు. 'ప్రపంచంలో మంచినటుడిగా, నటిగా అనిపించుకునే వారు ప్రతిరోజు ఏదోఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఇదే సోనమ్కు కూడా వర్తిస్తుంది. ఆమెకు ఎంతమంది నుంచి పొగడ్తలు వస్తున్నా, ఎవరు ఏ విధంగా మెచ్చుకుంటున్నా సోనమ్ మాత్రం ఇంకా నేర్చుకోవాల్సిందే. ఒక నటిగా ఆమె ఎప్పుడూ విద్యార్థినే' అని ఆయన అన్నారు.

నటన అనేది ఒక సముద్రమంత విశాలమైనదని, దాన్ని ఎప్పటికీ పూర్తిగా నేర్చుకోలేమని అన్నారు. ప్రతిసారి తనకు తాను పునరాగమనం చెప్పుకొని కొత్తగా ప్రారంభించాల్సిందేనని చెప్పారు. నీర్జా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఆ చిత్రం తమ కుటుంబం మొత్తాన్ని ఒక భావోద్వేగంలోకి తీసుకెళ్లిందని చెప్పారు. బహుశా ప్రయాణీకుల కోసం నాడు ప్రాణ త్యాగం చేసిన నీర్జా భానోత్ ఆశీస్సులు తన కూతురుకు అందడం వల్లే సినిమా అంత బాగా వచ్చిందని అనుకుంటున్నానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement