సోనమ్‌ కపూర్‌ సమాధానంపై జోకులు | Sonam Kapoor Trolled By Twitter Mathematician | Sakshi
Sakshi News home page

సోనమ్‌ కపూర్‌ సమాధానంపై జోకులు

Apr 9 2018 8:39 PM | Updated on Apr 3 2019 6:34 PM

Sonam Kapoor Trolled By Twitter Mathematician - Sakshi

ముంబై : మనలో చాలా మందికి పజిల్స్‌ పూర్తి చేయాలనే ఆసక్తి ఉంటుంది. పజిల్‌కి జవాబు తెలిస్తే అంతటితో ఊరుకోకుండా మన స్నేహితులు, తెలిసిన వారిని జవాబు చెప్పుకోండంటూ వారికి సవాల్‌ విసురుతాం. ఫిలింఫేర్‌ మ్యాగజీన్‌ ఎడిటర్‌ జితేశ్‌ పిల్లై కూడా సరిగ్గా ఇదే పని చేశారు. లాజికల్‌ అండ్‌ రీజనింగ్‌కు సంబంధించిన ఒక పజిల్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ట్రయాంగిల్స్‌తో కూడిన ఒక పెద్ద ట్రయాంగిల్‌ చిత్రాన్ని పోస్ట్‌ చేసిన జితేశ్‌ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్‌ ఉన్నాయో జవాబు కనిపెట్టాలంటూ నెటిజన్లను కోరారు. వెంటనే స్పందించిన బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ తనకు తోచిన జవాబు చెప్పేశారు. అయితే ఆ జవాబు తప్పు కావడంతో గణిత శాస్త్ర ‘ఉద్దండ పండితులు’ ఆమెపై జోకులు వేసేందుకు సిద్ధమైపోయారు.

‘నువ్వు చెప్పింది తప్పు. ట్యూషన్‌కు వెళ్తేనైనా సరైన సమాధానం తెలుస్తుందంటూ’ ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేయగా..  ‘ఆమెకు బుర్ర పనిచేయడం లేదంటూ’ మరొకరు సెటైర్‌ వేశారు. అయితే నెటిజన్ల కామెంట్లను తేలిగ్గా తీసుకున్న సోనమ్‌.. ‘నేను చెప్పింది తప్పు సమాధానమని నాకు ముందే తెలుసు. మరి సరైన సమాధానమేంటో మీరు చెప్పండి’ అంటూ రివర్స్‌ పంచ్‌ వేసింది. ఇంతకీ జవాబేంటో చెప్పలేదు కదూ.. కొందరు 24 త్రిభుజాలని, మరికొందరు 18 మాత్రమే ఉన్నాయంటూ ట్వీట్‌ చేస్తున్నారు. ఫొటో చూశారుగా మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సోనమ్‌ చెప్పలేకపోయిన జవాబు మీరు చెప్పేయండి.

Advertisement
 
Advertisement
Advertisement