అది నా వ్యక్తిగత నిర్ణయం : సోనమ్‌

Sonam Kapoor Says Changing Surname Is Her Own Choice - Sakshi

అనిల్‌ కపూర్‌ గారాల పట్టి సోనమ్‌ కపూర్‌ వివాహం ఈనెల(మే) 8న వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తంతు ముగిసిన వెంటనే సోనమ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో తన పేరును సోనమ్‌ కె అహుజాగా మార్చుకున్నారు. అయితే సోనమ్‌ ఈ నిర్ణయంపై ఆమె అభిమానులు, ఫెమినిస్టులు మండిపడుతున్నారు. ఫెమినిస్ట్‌గా గుర్తింపు పొందిన మీరు ఇలా ఎలా చేస్తారంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై సోనమ్‌ స్పందించారు. ప్రస్తుతం కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సోనమ్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చాలా రోజుల క్రితమే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చాను. దీర్ఘకాలం నుంచి రిలేషన్‌ షిప్‌లో ఉన్న నేను.. ప్రస్తుతం పెళ్లి చేసుకున్నాను. ఇక ఇంటి పేరు మార్చుకోవడం అనేది వ్యక్తిగతమైన అంశ’మంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘ఫెమినిజం అనే కాన్సెప్ట్‌ను సరిగా అర్థం చేసుకోలేని వాళ్లు ఆన్‌లైన్‌కు వెళ్లి ఓసారి చెక్‌ చేయాలి. అయినా ఆనందే నా పేరు మార్చాడని మీకెలా తెలుసంటూ’ ఘాటుగా స్పందించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top